Kothagudem Singareni : నల్ల బ్యాడ్జీలతో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల నిరసన
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాభాల వాటా విషయంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఐ ఎఫ్ టి యు) ఆధ్వర్యంలో కార్మికులు మంగళవారం నల్ల బ్యాడ్జీలు, నల్లజెండాలతో విధులకు హాజరై నిరసన తెలిపారు.
కొత్తగూడెం సింగరేణి, సెప్టెంబర్ 23 : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాభాల వాటా విషయంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఐ ఎఫ్ టి యు) ఆధ్వర్యంలో కార్మికులు మంగళవారం నల్ల బ్యాడ్జీలు, నల్లజెండాలతో విధులకు హాజరై నిరసన తెలిపారు. ఆ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు, కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి ఎన్.సంజీవులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాభాల్లో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. సింగరేణి సంస్థకు వచ్చిన రూ.6,094 కోట్ల లాభాల్లో కాంట్రాక్ట్ కార్మికుల శ్రమ కూడా ఉందన్నారు. కాంట్రాక్ట్ కార్మికులు సింగరేణి కార్మికులతో సమానంగా పనులు చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికులకు కేవలం రూ.5,500 మాత్రమే ప్రకటించడం అంటే కాంట్రాక్ట్ కార్మికులను మోసం చేయడమే అని విమర్శించారు.
సింగరేణిలో గుర్తింపు సంఘం ప్రాతినిధ్యం సంఘం కాంటాక్ట్ కార్మికులకు ఏమాత్రం లాభాల వాటా పెంచడానికి ప్రయత్నం చేయలేదని, ఏదైనా చేస్తే తామే చేయాలన్నారు. కాంట్రాక్ట్ కార్మికుల దగ్గర మీటింగ్‌లు పెట్టే ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ నాయకులు కాంట్రాక్ట్ కార్మికుల పక్షాన ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కాంట్రాక్ట్ కార్మికులకు కనీసం రూ.10 వేలు ఎందుకు ఇప్పించలేకపోయారో జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికులకు రూ.20 వేలు లాభాల వాటా చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ డివిజన్ నాయకులు కరుణ, సంధ్య, లక్ష్మి నరసింహ, రామకృష్ణ, పాషా, కృష్ణ, లక్ష్మణ్ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
- Tags
- AITUC
- INTUC
- Kothagudem
- Singareni
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

