బూర్గంపహాడ్, ఏప్రిల్ 03 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని పారిశ్రామిక ప్రాంతమైన సారపాకలో ఇటీవల ప్రజలు, ప్రయాణీకుల సౌకర్యార్ధం పబ్లిక్ టాయిలెట్‌ను నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే పబ్లిక్ టాయిలెట్ వద్ద నిర్వాహకుడు ఎండలో ఉండే విధులు నిర్వహిస్తున్నాడు. గురువారం ‘నమస్తే తెలంగాణ వెబ్ ఎడిషన్‌లో ‘పబ్లిక్ టాయిలెట్ నిర్వాహకుడికి ‘నీడ’ కరువు’ అనే కథనం ప్రచురితమైంది. దీనిపై శుక్రవారం పంచాయతీ సర్పంచ్ గుగులోత్ కిశోర్, ఉప సర్పంచ్ కన్నెదారి రమేశ్, కార్యదర్శి కంది మహేశ్ స్పందించి సిబ్బందిచే పబ్లిక్ టాయిలెట్ వద్ద రేకుల షెడ్ ఏర్పాటు చేయించారు. నిర్వాహకుడికి ఎండ తగలకుండా చర్యలు చేపట్టారు. సమస్య పరిష్కారం కావడంతో పంచాయతీ ప్రజలు, ప్రయాణీకులు ‘నమస్తే’ దినపత్రికకు కృతజ్ఞతలు తెలిపారు.