Kothagudem Urban : ‘కోతులు, కుక్కల బెడద నుండి రక్షించండి’
కోతులు, కుక్కల భారీ నుండి ప్రజలను కాపాడాలని, అవి చేసే దాడుల్లో పట్టణ ప్రజలు తీవ్ర గాయాలై ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కౌన్సిల్ సభ్యుడు మునిగడప వెంకటేశ్వర్లు, గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు భూక్య శ్రీనివాస్ అన్నారు.
కొత్తగూడెం అర్బన్, సెప్టెంబర్ 23 : కోతులు, కుక్కల భారీ నుండి ప్రజలను కాపాడాలని, అవి చేసే దాడుల్లో పట్టణ ప్రజలు తీవ్ర గాయాలై ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కౌన్సిల్ సభ్యుడు మునిగడప వెంకటేశ్వర్లు, గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు భూక్య శ్రీనివాస్ అన్నారు. మంగళవారం స్థానిక వనందాస్ గడ్డలో కోతులు కుక్కల సమస్యలపై ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడారు. రామవరం ప్రాంతంలో కోతులు, కుక్కలు మనుషులపై దాడి చేసి గాయపరుస్తున్నాయని, ప్రజలు భయాందోళన చెబుతున్నట్లు తెలిపారు. కోతులు ఇండ్లలో జొరబడి ఇంట్లోని వస్తువులను కిరాణా సరుకులను చిందరవందర చేస్తూ, ఇంటిపైకి ఎక్కి రేకులు పగుల గొడుతున్నట్లు వెల్లడించారు.
గత నాలుగు రోజుల క్రితం ఒక మున్సిపల్ ఉద్యోగిపై కోతులు దాడి చేసినా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు చలనం లేదని తక్షణమే అధికారులు స్పందించి వాటి నివారణ కోసం చర్యలు తీసుకుని ప్రజలను కాపాడాలని వారు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో వనందాసుగడ్డ శాఖ సహాయ కార్యదర్శులు తోగరు నరేంద్ర కుమార్, ఎస్ కే జలీల్, సీనియర్ నాయకులు ఆది మల్లయ్య, సూరిమేని రామారావు, కడారి మల్లేష్, శంకర్, నాగోల్ మీరా, అలీం, రమేశ్, వెంకన్న, కృషీద్, పాషా పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
- Tags
- cpi
- dogs
- Kothagudem urban
- monkeys
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

