హెచ్చరిక సూచికలు నిల్… ప్రమాదాలు పుల్
జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు అధికారులు తీసుకోవాల్సిన చర్యలు కొరవడుతున్నాయనే ఆరోపణలు వినవస్తున్నాయి. జాతీయ, ప్రధాన రహదారులపై ప్రమాద సూచిక బోర్డులు, రేడియం స్టిక్కర్లతో కూడిన సూచికలు, రిఫ్లెక్టర్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉన్నా...
– బూర్గంపహాడ్‌లో రహదారి నిర్వహణణు పట్టించుకోని అధికారులు
– అధికారులపై వాహనదారులు, ప్రజల మండిపాటు
బూర్గంపహాడ్, నవంబర్ 10 : జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు అధికారులు తీసుకోవాల్సిన చర్యలు కొరవడుతున్నాయనే ఆరోపణలు వినవస్తున్నాయి. జాతీయ, ప్రధాన రహదారులపై ప్రమాద సూచిక బోర్డులు, రేడియం స్టిక్కర్లతో కూడిన సూచికలు, రిఫ్లెక్టర్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉన్నా బూర్గంపహాడ్ మండలంలో వాటిని ఏర్పాటు చేయడంలో సంబంధిత అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలు వాహనదారులు, ప్రజల నుండి వినవస్తున్నాయి. బూర్గంపహాడ్ మండలంలోని మోరంపల్లిబంజర్ రింగ్ సెంటర్‌కు సమీపంలో అంజనాపురం నుండి వచ్చే సమయంలో వాహనాలకు ఎదురుగా హెచ్చరిక, ప్రమాద సూచిక బోర్డులు, రేడియం సూచికలు కనిపించకపోవడంతో ఎదురుగా ఉన్న డివైడర్‌ను వాహనాలు ఢీకొట్టి ప్రమాదానికి కారణమవుతున్నాయి.
మోరంపల్లిబంజర్, లక్ష్మీపురం, బూర్గంపహాడ్, సారపాక తదితర ప్రధాన ప్రాంతాల్లో వీటిని సంబంధిత అధికారులు ఏర్పాటు చేయకపోవడంతో నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇటీవల కాలంలో వరుస ప్రమాదాలు చోటుచేసుకున్నా అధికారులకు ఈ విషయంలో చలనం కలగడంలేదా అని పలువురు వాహనదారులు మండిపడుతున్నారు. ప్రమాద సూచికలు, హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో పాటు బూర్గంపహాడ్- సారపాక వరకు జాతీయ రహదారి గుంతలమయంగా ఉండటంతో రాత్రిళ్లు ఈ ప్రమాదాల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రధాన ప్రాంతాల్లో జాతీయ రహదారి, ప్రధాన రహదారుల వద్ద ప్రమాద సూచిక బోర్డులు, రేడియం స్టిక్కర్‌తో ఉండే సూచికలు, రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేయాలని వాహనదారులు, మండల ప్రజలు కోరుతున్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
హెచ్చరిక సూచికలు నిల్… ప్రమాదాలు పుల్
పోలింగ్ కేంద్రాలను పెంచాలని అఖిలపక్షం తీర్మానం
Tamil Nadu | ఐఫోన్ ఫ్యాక్టరీలో ప్రమాదం.. ఊపిరాడక ముగ్గురు కార్మికులు దుర్మరణం
Jewelry store | నగల దుకాణంకు కన్నం.. రూ.80 లక్షల బంగారం, వెండి చోరీ
Yash | రావణుడి గెటప్‌లో పిల్లలతో యశ్ దీపావళి వేడుకలు.. ఫొటోలు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

