పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి : ఎస్పీ రోహిత్ రాజు
పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, నాణ్యమైన దర్యాప్తుతో బాధితులకు సత్వర న్యాయం అందించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పోలీసు అధికారులను ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా జూలూరుపాడు పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన ఆయన స్టేషన్ నిర్వహణ, సిబ్బంది పనితీరు...
జూలూరుపాడు, అక్టోబరు 09 : పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, నాణ్యమైన దర్యాప్తుతో బాధితులకు సత్వర న్యాయం అందించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పోలీసు అధికారులను ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా జూలూరుపాడు పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన ఆయన స్టేషన్ నిర్వహణ, సిబ్బంది పనితీరు, నేరాల నియంత్రణ, కేసుల దర్యాప్తు పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించి, పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. స్టేషన్‌ను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వివిధ సమస్యలతో వచ్చే బాధితులతో మర్యాదగా వ్యవహరిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్లో నమోదైన యూఐ, గ్రేవ్, ప్రాపర్టీ కేసుల వివరాలను పరిశీలించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించారు. క్రైమ్ రికార్డులను క్రమబద్ధంగా నిర్వహించడంతోపాటు ప్రతి కేసుకు సంబంధించిన వివరాలు, దర్యాప్తు పురోగతి, పెండింగ్ అంశాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు.

పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి : ఎస్పీ రోహిత్ రాజు
నేరాలకు సంబంధించిన ఆస్తుల నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, స్వాధీనం చేసుకున్న వస్తువుల భద్రత, గుర్తింపు, కోర్టు సంబంధిత ప్రక్రియలను నిబంధనల ప్రకారం చేపట్టాలని తెలిపారు. గతంలో నేరాలకు పాల్పడిన వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని, పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గంజాయి అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ, వారి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ, సీఐ శ్రీలక్ష్మి, ఎస్సైలు జీనత్ కుమార్, మనీషా, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి : ఎస్పీ రోహిత్ రాజు
Chevella Court | క్రిమినల్ కేసులను చేవెళ్ల కోర్టుకు బదిలీ చేయడం హర్షనీయం
గుర్రంపోడులో రైతులకు హెచ్‌పీఎస్, ఐసీఎంపై శిక్షణ
Rajya Sabha | ఉత్తర ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం.. 8 సీట్లు గెలిచిన బీజేపీ.. ఎస్పీకి 2 సీట్లు
MLA Palla Rajeshwar Reddy | మోదీ,అమిత్ షాతో సీఈసీ కుమ్మక్కు : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

