‘రైతులు నానో యూరియా వినియోగంపై అవగాహన పెంచుకోవాలి’
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో జిల్లా కలెక్టర్ అంకిత్ శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. బొమ్మనపల్లి పీఏసీఎస్ ఎరువుల గిడ్డంగులను తనిఖీ చేసి యూరియా నిల్వలు, పంపిణీ వివరాలను పరిశీలించారు. రైతులు యూరియా బుకింగ్ యాప్‌ను..
– భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్
టేకులపల్లి, జూలై 03 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో జిల్లా కలెక్టర్ అంకిత్ శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. బొమ్మనపల్లి పీఏసీఎస్ ఎరువుల గిడ్డంగులను తనిఖీ చేసి యూరియా నిల్వలు, పంపిణీ వివరాలను పరిశీలించారు. రైతులు యూరియా బుకింగ్ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని, నానో యూరియా వినియోగంపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం 9వ మైలు తండాలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని పరిశీలించి అర్హులైన ప్రతి ఓటరిని నమోదు చేసి ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. టేకులపల్లి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం, జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆర్వో ప్లాంట్‌ను వెంటనే మరమ్మతు చేయాలని, విద్యార్థినులకు నాణ్యమైన విద్య, పరిశుభ్రమైన తాగునీరు, పోషకాహారం, మెరుగైన హాస్టల్ సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట తాసీల్దార్ వీరభద్రం, ఎంఈఓ జగన్, వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు.

‘రైతులు నానో యూరియా వినియోగంపై అవగాహన పెంచుకోవాలి’
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

