‘సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలి’
సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ పంచాయతీరాజ్ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో, TGEJAC పిలుపు మేరకు చుంచుపల్లి మండల పరిషత్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.
– నల్ల బ్యాడ్జీలతో పంచాయతీరాజ్ ఉద్యోగుల నిరసన
చుంచుపల్లి, సెప్టెంబర్ 01 : సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ పంచాయతీరాజ్ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో, TGEJAC పిలుపు మేరకు చుంచుపల్లి మండల పరిషత్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు పులికంటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పులికంటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉద్యోగికి పెన్షన్ అనేది హక్కు తప్ప భిక్ష కాదని అన్నారు. ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2004 నుండి సీపీఎస్ అమలులో ఉండటంతో ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం ఆర్థిక భద్రతపై ఆందోళన చెందుతున్నారని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేసి సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. ఓపీఎస్ అమలు చేయడం ద్వారా ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం పెన్షన్ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకుని ఉద్యోగుల న్యాయమైన డిమాండ్‌ను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమానికి మండల పరిషత్ అభివృద్ధి అధికారి, జిల్లా పరిషత్ యూనిట్ మినిస్టీరియల్ స్టాఫ్ యూనియన్ కార్యదర్శి అంబికాదేవి, పంచాయతీ కార్యదర్శులు, ఉద్యోగులు తదితరులు హాజరయ్యారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

