ఎమ్మెల్యే కూనంనేనికి కార్పొరేటర్ మునిగడప పద్మ వినతి
సింగరేణి పెన్షన్స్ రూ.2 వేల లోపు వస్తే ఆసరా పెన్షన్‌కి అనుమతించాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకి 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ, సిపిఐ కార్పొరేటర్స్, గిరిజన సంఘం నాయకులతో కలిసి వినతి పత్రాన్ని అందించారు. శుక్రవారం స్థానిక కొత్తగూడెం క్లబ్లో...
రుద్రంపూర్, నవంబర్ 13 : సింగరేణి పెన్షన్స్ రూ.2 వేల లోపు వస్తే ఆసరా పెన్షన్‌కి అనుమతించాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకి 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ, సిపిఐ కార్పొరేటర్స్, గిరిజన సంఘం నాయకులతో కలిసి వినతి పత్రాన్ని అందించారు. శుక్రవారం స్థానిక కొత్తగూడెం క్లబ్లో జరిగిన ఆసరా పెన్షన్ కార్యక్రమంలో ఎమ్మెల్యేకి వినతిపత్రం అందించిన కార్పొరేటర్ మునిగడప పద్మ కరెంటు బిల్లు, నాలుగు చక్రాల వాహనం తదితర చిన్న చిన్న సాంకేతిక లోపంతో 360 డిగ్రీల పేరుతో ప్రొసీడింగ్స్ ఇవ్వకుండా ఆపిన లబ్ధిదారులకు కూడా ప్రొసీడింగ్స్ ఇచ్చి పెన్షన్స్ మంజూరు చేయాలని కోరారు. గత ఐదారు సంవత్సరాల క్రితం లబ్ధిదారులు బ్యాంకులో లోన్ ద్వారా కార్లు కొనుగోలు చేసి టాక్సీ నడుపుకున్న వారు ఆర్థిక పరిస్థితి బాగాలేక విక్రయించిన వారి కుమారులు లేదా భర్తల పేర్లు ఆన్లైన్లో 360 డిగ్రీలలో చూపెడుతున్నాయని ఆ లబ్ధిదారుల పేర్లను కూడా ఆపివేయడం జరిగిందని ఎమ్మెల్యేకు వివరించారు.
స్థానికంగా చుట్టుపక్కల వారిని విచారించి వారికి నాలుగు చక్రాల వాహనం లేదని తెలితే వారికి కూడా పెన్షన్స్ మంజూరు చేయాలని ఎమ్మెల్యేకి విన్నవించారు. ఎమ్మెల్యే అధికారుల దృష్టికి తీసుకెళ్లి అనంతరం సంబంధిత అధికారులు రూ.2 వేల లోపు సింగరేణి పెన్షన్ ఉంటే చేయూత పెన్షన్ కు అనుమతిస్తామని సభాముఖంగా హామీ ఇచ్చారని ఆమె తెలిపారు. చిన్న చిన్న సాంకేతిక కారణాలతో ఆగిన పెన్షన్లపై కూడా మరోసారి పునర్ పరిశీలన చేసి న్యాయం చేస్తామని అధికారులు తెలిపారన్నారు. అనంతరం 16వ డివిజన్లో 44 మంది లబ్ధిదారులకు చేయూత పెన్షన్లు మంజూరు అయినట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, మేయర్ మూడ్ గణేష్ చేతుల మీదుగా పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గిరిజన సంఘం ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మునిగడప వెంకటేశ్వర్లు, కార్పొరేటర్స్ బండి నరసింహా, బోయిన విజయ్, సుధాకర్ రాజు,ఎర్రబెల్లి శంకర్, సహారా బేగం, పోలమూరు ధనలక్ష్మి, దర్గయ్య, శాంతి ప్రియ, కంచర్ల హిమాశ్రీ, కళావతి, ఆకాంక్ష, నాగలక్ష్మి, హరిత పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎమ్మెల్యే కూనంనేనికి కార్పొరేటర్ మునిగడప పద్మ వినతి
Man Kills Wife | భార్యను చంపిన వ్యక్తి.. ‘కొత్త అమ్మ’ను తెస్తానని కూతురికి నచ్చజెప్పే యత్నం
నాగుల చవితి వేడుకల్లో ముస్లిం మహిళల పూజలు
కాళోజీకి ఘన నివాళి.. న్యాయవాదుల రక్తదానం
Ex-Minister Thalasani | గన్నవరం ఎయిర్‌పోర్టులో మాజీ మంత్రి తలసానికి ఘన స్వాగతం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

