బూర్గంపహాడ్, ఆగస్టు 22 : ఉప సర్పంచుల ఫోరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు మహంకాళి రామారావు అధ్యక్షతన బూర్గంపహాడ్ మండల ఉప సర్పంచుల ఫోరం నూతన కమిటీ కార్యవర్గాన్ని మండల పరిధిలోని తాళ్లగొమ్మూరు రైతు వేదికలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఎన్నుకున్నారు. మండల ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా కృష్ణసాగర్ ఉప సర్పంచ్ భూక్యా మోహనరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా తోటమళ్ల వెంకటరమణ, ప్రధాన కార్యదర్శిగా అప్పిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా పొదెం సుధాకర్, కోశాధికారిగా పండగ సౌజన్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ మండలంలో ఉప సర్పంచుల ఐక్యత, హక్కుల సాధన, గ్రామాల అభివృద్ధి కోసం నూతన కార్యవర్గం సమిష్టిగా కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సారపాక ఉప సర్పంచ్ కన్నెదారి రమేశ్, ఆయా పంచాయతీల ఉప సర్పంచులు మోడెం రాధాకృష్ణ, కేశనపల్లి బేబి, సున్నం కృష్ణవేణి, సీహెచ్.కుమారి పాల్గొన్నారు.
ఉప సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడిగా ఎన్నికైన కృష్ణసాగర్ ఉప సర్పంచ్ భూక్యా మోహనరావును పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ తాటి వాణి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి నాగిరెడ్డి, గ్రామస్థులు పాల్గొన్నారు.

ఉప సర్పంచుల ఫోరం బూర్గంపహాడ్ మండల నూతన కార్యవర్గం