బూర్గంపహాడ్, సెప్టెంబర్ 09 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని మోరంపల్లిబంజర్ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్(ఏఏఎఫ్ఏ) ఆధ్వర్యంలో బుధవారం విద్యార్ధినులకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన సర్పంచ్ బొర్రా సుభద్ర, పీహెచ్సీ వైద్యులు నగేశ్ వ్యాక్సిన్‌కు సంబంధించి విద్యార్ధినులకు వివరించారు. ఈ వ్యాక్సిన్ క్యాన్సర్ నివారణకు ఎంత కీలకమో అవగాహన కల్పించారు. హెచ్‌పీవీ వ్యాక్సిన్‌కు సంబంధించి కరపత్రాలను పాఠశాలలో విద్యార్ధినులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి భవానీ, ఉప సర్పంచ్ పొక్కుల రవి, హెచ్ఎంతో పాటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ బాధ్యులు మతిన్, ఉదయ్, మంజర్, సంతోష్, సాత్విక్, బన్ని, వంశీ, అఖిల్, విల్లా పాల్గొన్నారు.