అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
సింగరేణి కొత్తగూడెం ఏరియా నూతన జీఎం కార్యాలయం సమీపంలోని అనధికారిక యూటర్న్ వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. ఉద్యోగుల సౌకర్యార్థం కార్యాలయం ప్రారంభ సమయంలో ఏర్పాటు చేసిన ఈ యూటర్న్ వద్ద కొద్ది రోజులకే ప్రమాదం జరగడంతో అధికారులు కర్రలతో తాత్కాలికంగా...
– త్రీ ఇంక్లైన్ వద్ద వరుస ప్రమాదాలు
– కర్రలతో తాత్కాలికంగా మూసివేసిన పోలీసులు
– శాశ్వత పరిష్కారం ఎప్పుడు ?
రుద్రంపూర్, అక్టోబర్ 15 : సింగరేణి కొత్తగూడెం ఏరియా నూతన జీఎం కార్యాలయం సమీపంలోని అనధికారిక యూటర్న్ వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. ఉద్యోగుల సౌకర్యార్థం కార్యాలయం ప్రారంభ సమయంలో ఏర్పాటు చేసిన ఈ యూటర్న్ వద్ద కొద్ది రోజులకే ప్రమాదం జరగడంతో అధికారులు కర్రలతో తాత్కాలికంగా మూసివేశారు. అయితే, కొంతకాలంగా అక్కడి అడ్డంకులు తొలగిపోవడంతో వాహనదారులు మళ్లీ యూటర్న్‌ను వినియోగిస్తున్నారు. దీంతో ప్రమాదాలు పునరావృతమవుతున్నాయి. గురువారం సత్తుపల్లి నుండి కొత్తగూడెం వెళ్తున్న కారు ముందు వెళ్తున్న ఆటో ఒక్కసారిగా యూటర్న్ తీసుకోవడంతో దాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ రోడ్డుపై పడిపోగా, అదుపుతప్పిన ఆటో సుమారు 200 మీటర్ల దూరంలో ఉన్న ఎంబీటీసీ కార్యాలయం వద్ద పోసిన మట్టి కుప్పలను ఢీకొని ఆగింది. ఆ సమయంలో అటువైపు ఇతర వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఆటో ధ్వంసం కాగా, డ్రైవర్‌కు గాయాలయ్యాయి.
తాత్కాలికంగా మూసివేసిన పోలీసులు
ప్రమాదం జరిగిన తీరును పరిశీలించిన కొత్తగూడెం టూ టౌన్ ఎస్హెచ్ఓ ఎస్.కె.యాసిన్.. శాశ్వతంగా యూటర్న్ మూసివేసే చర్యలు చేపట్టే వరకు కర్రలతో తాత్కాలికంగా మూసివేయించారు. వరుస ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు స్పందించి యూటర్న్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వాహనదారులు కోరుతున్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
చికిత్స పేరుతో మహిళకు వేధింపులు.. వైద్యుడి అరెస్ట్
ACB Net | రూ.8వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్
Srilanka Cricket | ముక్కోణపు వన్డేలకు ఓపెనర్ దూరం.. అన్క్యాప్డ్ కుర్రాడికి భలే అవకాశం..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

