‘చుంచుపల్లిలో పింఛన్‌దారుల ఆధార్ అథెంటిఫికేషన్ 83 శాతం పూర్తి’
చుంచుపల్లి మండలంలో పింఛన్ లబ్ధిదారుల ఆధార్ అథెంటిఫికేషన్ ప్రక్రియ 83 శాతం పూర్తయినట్లు ఎంపీడీఓ సుభాషిణి తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు మండలంలోని పింఛన్ లబ్ధిదారుల వివరాల ధ్రువీకరణ కార్యక్రమం..
– ఎంపీడీఓ సుభాషిణి
చుంచుపల్లి, జూన్ 19 : చుంచుపల్లి మండలంలో పింఛన్ లబ్ధిదారుల ఆధార్ అథెంటిఫికేషన్ ప్రక్రియ 83 శాతం పూర్తయినట్లు ఎంపీడీఓ సుభాషిణి తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు మండలంలోని పింఛన్ లబ్ధిదారుల వివరాల ధ్రువీకరణ కార్యక్రమం కొనసాగుతుందని ఆమె వెల్లడించారు. మండలంలో మొత్తం 3,815 మంది పింఛన్ లబ్ధిదారులు ఉండగా, ఇప్పటివరకు 3,087 మంది ఆధార్ అథెంటిఫికేషన్ పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. ఇంకా 628 మంది లబ్ధిదారులు అథెంటిఫికేషన్ చేయించుకోవాల్సి ఉందన్నారు. పరిశీలనలో 100 మంది పింఛన్‌దారులు మృతి చెందినట్లు గుర్తించగా, వారిలో ఎనిమిది మంది వివరాలు ఇంకా నిర్ధారణకు రావాల్సి ఉందన్నారు.
అదేవిధంగా ముగ్గురు లబ్ధిదారుల ఆధార్ అథెంటిఫికేషన్ సాంకేతిక కారణాలతో సక్రమంగా నమోదు కాలేదని, వారి వివరాలను సరిచేసే చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నడవలేని వారు, అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధుల కోసం సిబ్బంది నేరుగా వారి ఇళ్లకు వెళ్లి ఆధార్ అథెంటిఫికేషన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కొంతమంది పింఛన్ లబ్ధిదారులు ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఉండటంతో వారి కుటుంబ సభ్యులు, పరిసర ప్రాంతాల ప్రజల ద్వారా సమాచారం సేకరిస్తున్నట్లు వివరించారు. ఆధార్ అథెంటిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఈ నెల 22వ తేదీ వరకు గడువు నిర్ధేశించిందని, అర్హులైన లబ్ధిదారులు వెంటనే తమ వివరాలను ధ్రువీకరించుకోవాలని ఎంపీడీఓ సూచించారు. మిగిలిన లబ్ధిదారులందరి అథెంటిఫికేషన్ను గడువు తేదీలోపు పూర్తి చేయడానికి అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఆమె పేర్కొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
Army van overturns | అల్లవాడ గేట్ సమీపంలో ఆర్మీ వ్యాన్ బోల్తా..ఎనిమిది మంది జవాన్లకు తీవ్రగాయాలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

