ఖమ్మం ఎడ్యుకేషన్, జూన్ 19: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్పీ) గ్రూప్-2 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల నుంచి ఉచిత గ్రాండ్ టెస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జీ.శ్రీలత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 8వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నాలుగు గ్రాండ్ టెస్టుల్లో 12 పరీక్షలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఈ నెల 19వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం 9573859598 నంబరులో సంప్రదించాలని కోరారు.