రక్త మోడిన రహదారులు
మణుగూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు-లారీ ఎదురుదెరుగా బలంగా ఢీకొన్నాయి. వీటి డ్రైవర్లు ఇద్దరూ మృతిచెందారు. ఐదుగురికి తీవ్రంగా, 10 మందికి స్వల్పంగా గాయాలయ్యాయి. మణుగూరు మండలం రామానుజవరం పంచాయతీ పరిధిలో గురువారం ఈ దుర్ఘటన జరిగింది
రెండు చోట్ల రోడ్డు ప్రమాదం
నలుగురు మృతి 20 మందికి గాయాలు
ఆర్టీసీ బస్సు, బొగ్గు టిప్పర్ ఢీకొని ఇద్దరు డ్రైవర్లు..
ఐదుగురికి తీవ్ర, పదిమందికి స్వల్ప గాయాలు
మణుగూరు రూరల్, జూన్ 16: మణుగూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు-లారీ ఎదురుదెరుగా బలంగా ఢీకొన్నాయి. వీటి డ్రైవర్లు ఇద్దరూ మృతిచెందారు. ఐదుగురికి తీవ్రంగా, 10 మందికి స్వల్పంగా గాయాలయ్యాయి. మణుగూరు మండలం రామానుజవరం పంచాయతీ పరిధిలో గురువారం ఈ దుర్ఘటన జరిగింది. స్థానికులు, క్షతగాత్రులు, ప్రయాణికులు తెలిపిన వివరాలు.. గుండాల మండలం రంగాపురం నుంచి 15 మంది ప్రయాణికులతో ఆర్టీసీ మణుగూరు డిపో బస్సు (ఏపీ 29 జడ్ 0359) వస్తున్నది. మణుగూరు నుంచి బొగ్గు లోడుతో టిప్పర్ (టీఎస్ 28 టీ 9779) బీటీపీఎస్‌కు వెళ్తున్నది. వేగంగా వెళ్తున్న ఈ రెండు వాహనాలు రామానుజవరం సమీపంలోని సాంబాయిగూడెం గుట్ట వద్ద, ముందు వెళ్తున్న ఆటోను తప్పించే క్రమంలో ఎదురెదురుగా ఢీకొన్నాయి. బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. రోడ్డు పక్కనున్న పొలాల్లో టిప్పర్ బోల్తా పడింది. బస్సు డ్రైవర్ రాంబాబు(55) నడుము భాగం క్యాబిన్లో ఇరుక్కుపోయింది. టిప్పర్ డ్రైవర్ మంథన్(50) క్యాబిన్లో ఇరుక్కుపోయాడు.
తమను కాపాడాలంటూ వీరిద్దరూ ఆర్తనాదాలు చేశారు. వీరిని స్థానికులు అతి కష్టంగా బయటకు తీశారు. టిప్పర్ డ్రైవర్ మంథన్కు నడుము భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ రాంబాబుకు రెండు కాళ్లు, చెయ్యి విరిగాయి. బస్సులో ప్రయాణిస్తున్న మొత్తం 15 మందిలో కుంటా వెంకమ్మ, కొట్టెం సత్తమ్మ, బదావత్ రమేశ్, బొగ్గం కావ్య, పుండి శ్యామలకు తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన పదిమందికి స్వల్ప గాయాలయ్యాయి. వీరంతా మణుగూరు వాసులే. వీరందరినీ వంద పడకల ఆస్పత్రికి సీఐ ముత్యం రమేశ్, ఎస్సై పురుషోత్తం, స్థానికులు కలిసి తరలించారు. అప్పటికే ఇద్దరు డ్రైవర్లు మృతి చెందినట్లు వైద్యాధికారులు ధ్రువీకరించారు. ఆస్పత్రిలో క్షతగాత్రులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు పరామర్శించారు. మెరుగైన వైద్యం కోసం అవసరమైతే భద్రాచలం తరలించాలని సూపరింటెండెంట్ డాక్టర్ పంచగిరి గిరి ప్రసాద్‌కు సూచించారు.
ఆటో బోల్తాపడి ఇద్దరు.. ఐదుగురికి తీవ్ర గాయాలు
కల్లూరు, జూన్ 16: ఆటో బోల్తాపడిన ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని గోపాలదేవబోయినపల్లి(బోడిమెల్ల)లో గురువారం రాత్రి ఇది జరిగింది. స్థానికులు, క్షతగాత్రులు తెలిపిన వివరాలు.. పెనుబల్లి మండలం మండాలపాడు గ్రామానికి చెందిన 12 మంది, చెన్నూరులో వివాహ వేడుకకు ఆటోలో వెళ్లారు. తిరిగి అదే ఆటోలో తిరుగు ప్రయాణమయ్యారు. గోపాలదేవబోయినపల్లి(బోడిమెల్ల) వద్ద ఈ ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. అందులో ప్రయాణిస్తున్న మండాలపాడుకు చెందిన 10వ తరగతి విద్యార్థ్ధి ఇడుపులపాటి కౌశిక్(15) అక్కడికక్కడే మృతిచెందాడు. ఇంటర్ విద్యార్థి చాట్ల కార్తీక్, బి.చిన్నరాయుడు, కామేశ్వరరావు, స్వామి, నాగరాజు, సంపత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని కల్లూరు ఆసుపత్రి నుంచి ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యలో చాట్ల కార్తీక్(17) మృతిచెందాడు. ప్రమాద స్థలాన్ని ఎస్సై వెంకటేష్ పరిశీలించారు. ఇడుపులపాటి కౌశిక్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పెనుబల్లి ఆసుపత్రికి తరలించారు. ప్రమాద స్థలం వద్ద మృతుల బంధువులు, కుటుంబీకుల రోదన.. చూపరులకు కంట తడి పెట్టించింది. కేసును ఎస్సై వెంకటేష్ దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబీకులకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఖమ్మం ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. బాధిత కుటుంబాలను ఓదార్చారు. అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
- Tags
- Dead
- Fatal
- Injured
- Road Accidents
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

