బుధవారం 01 ఏప్రిల్ 2020
Khammam - Feb 11, 2020 , 23:20:18

ప్రజా సమస్యలు పరిష్కరించడమే ధ్యేయం

ప్రజా సమస్యలు పరిష్కరించడమే ధ్యేయం

సత్తుపల్లి, నమస్తే తెలంగాణ: సత్తుపల్లి నియోజకవర్గం నుంచి మూడు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి మంచి మనస్సున్న ఎమ్మెల్యేగా సండ్ర వెంకటవీరయ్య ప్రజల మన్ననలు పొందారని టీబీజీకేఎస్‌ నాయకులు చెన్నకేశవరావు, జేఎస్‌ఆర్‌ మూర్తి పేర్కొన్నారు. స్థానిక ఓసీలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మున్సిపల్‌ చైర్మన్‌ కూసంపూడి మహేశ్‌, ఎంపీపీ దొడ్డా హైమావతిశంకర్‌రావు దంపతులను మంగళవారం ఉదయం టీబీజీకేఎస్‌ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు నాయకులు మాట్లాడుతూ మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన సండ్ర సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలూ కృషిచేస్తూ అన్ని ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ విజయబావుటా ఎగరేసేందుకు కృషిచేశారని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ సత్తుపల్లి నియోజకవర్గంలో తన బాధ్యత మరింత పెరిగిందని, ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా పనిచేస్తానని అన్నారు. సింగరేణి కార్మికుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటానన్నారు. సింగరేణి పీవోలు సంజీవరెడ్డి, వెంకటాచారి, పిట్‌ సెక్రటరీలు సందిరి శ్రీనివాస్‌, శ్రీనివాస్‌, వెల్ఫేర్‌ ఆఫీసర్‌ సంతోశ్‌, కౌన్సిలర్లు అమరవరపు విజయనిర్మల, మేకల భవాని, నాగుల్‌మీరా, నాయకులు అమరవరపు కృష్ణారావు, మల్లూరు అంకమరాజు, నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.


logo
>>>>>>