అనుభవజ్ఞులైన వైద్యులతో సేవలు
24 గంటలూ అందుబాటులో డాక్టర్లు
సంకల్ప సీస్టార్ వైద్యశాల చైర్మన్ వీరేశ్వర్
ఆసుపత్రిలో కార్డియాలజీ సేవలు ప్రారంభం
ఖమ్మం వ్యవసాయం, ఆగస్టు 5: ఖమ్మంలోని సంకల్ప సీ స్టార్ వైద్యశాలలో ంచి కార్డియాలజీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వైద్యశాల చైర్మన్ డాక్టర్వీరేశ్వర్తో కలిసి ప్రముఖ కార్డియాలజీస్టు ప్రవీణ్‌కుమార్ గురువారం ఈ యూనిట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ వీరేశ్వర్ మాట్లాడుతూ తమ వైద్యశాలలో 24 గంటలూ అన్ని రకాల వైద్యసేవలు అందుబాటులో ఉంటున్నాయన్నారు. అందరి ఆదరాభిమానాలతో అనతికాలంలోనే వైద్యశాలకు ప్రత్యేక గుర్తింపురావడం సంతోషంగా ఉందన్నారు. రెండో వార్షికోత్సవం సందర్భంగా వైద్యశాలలో అంతర్జాతీయ కార్డియాలజిస్టు సీతారం ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో కార్డియాలజీ సేవలు అందిస్తామన్నారు. మేనేజింగ్ డైరక్టర్ డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ అనుభవజ్ఞులైన వైద్యులతో సేవలందిస్తున్నామన్నారు. డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, వైద్యులు పాల్గొన్నారు.