నిరసనాగ్రహం
కోట్లాది రూపాయలు ఆశ జూపి, పదవులను ఎర జూపి టీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు బీజేపీ నేతలు కుట్ర పన్నుతున్నారు.
- బీజేపీ కుట్రలపై భగ్గుమన్న టీఆర్ఎస్
- పార్టీ ఎమ్మెల్యేలకు ఎర వేయడంపై ఆగ్రహం
- ‘కాషాయ’ కుట్రలను తిప్పికొడతామని హెచ్చరిక
- ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు
- ప్రధాని మోదీ, బీజేపీ దిష్టిబొమ్మల దహనం
జిత్తులమారి బీజేపీ తెలంగాణపై విచ్చు కత్తులు దూస్తున్నది.. ఎనిమిదేళ్ల పసి రాష్ట్రంపై విషపు నాగులను వదులుతున్నది.. మత రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నది.. ప్రజల మధ్య మత చిచ్చు రాజేస్తున్నది.. సీఎం కేసీఆర్‌పై అకారణంగా కక్ష పెంచుకుని కాల కూట విషాన్ని కక్కుతున్నది.. ప్రభుత్వాన్ని కూలదోయాలని ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నది.. అందుకు ఎంతకైనా దిగజారుతున్నది.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నది.. ‘క్యాషా’య రాజకీయాలకు తెరలేపింది.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, గువ్వల బాలరాజు, హర్షవర్ధన్‌రెడ్డి, రోహిత్‌రెడ్డిని కొనేందుకు బేర సారాలు ప్రారంభించింది. ఎమ్మెల్యేల ముందస్తు సమాచారంతో బీజేపీ నేతల కుట్రలను తెలంగాణ పోలీసులు బుధవారం పటాపంచలు చేశారు.. కాషాయ నేతల కుట్రలపై గురువారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు బీజేపీ అధిష్ఠానం, ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను దహనం చేశారు..
ఖమ్మం, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కోట్లాది రూపాయలు ఆశ జూపి, పదవులను ఎర జూపి టీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు బీజేపీ నేతలు కుట్ర పన్నుతున్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని ఓ ఫాం హౌజ్‌లో ఈ బాగోతం బయటపడింది. ఎమ్మెల్యే రేగా కాంతారావు, హర్షవర్ధన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, రోహిత్‌రెడ్డి ముందస్తు సమాచారంతో హైదరాబాద్ పోలీస్ ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని బీజేపీ తొత్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై తెలంగాణ సమాజం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కాషాయ నేతల కుట్రలను చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు వెల్లువెత్తాయి. టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు బీజేపీ, ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
పచ్చని తెలంగాణలో బీజేపీ చిచ్చు: ఖమ్మం మేయర్ నీరజ
పచ్చని తెలంగాణలో చిచ్చుపెట్టేందుకు బీజేపీ కుట్రలు పన్నుతున్నదని ఖమ్మం నగరపాలక సంస్థ మేయర్ పునుకొల్లు నీరజ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు యత్నిస్తున్నందుకు నిరసనగా గురువారం నగరంలో పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కలిసి నిర్వహించిన నిరసన ర్యాలీలో ఆమె మాట్లాడారు. సీఎం కేసీఆర్‌కు ప్రజల్లో ఉన్న ఆదరణను చూసి ఓర్వలేకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా రాష్ట్ర ప్రభుత్వంపై కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికే ఎన్నో ప్రభుత్వాలను కూల దోశారని, ఇప్పుడు తెలంగాణపై దృష్టి సారించారని ఆరోపించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రలోభాలకు లొంగేవారు కారని, బీజేపీ ఆటలు సాగబోవన్నారు. కార్పొరేటర్లు కమర్తపు మరళి, కర్నాటి కృష్ణ, ఖమ్మం ఏఎంసీ చైర్పర్సన్ డీ లక్ష్మీప్రసన్న, రఘునాథపాలెం పార్టీ మండల అధ్యక్షుడు వీరూనాయక్, మంత్రి పువ్వాడ వ్యక్తిగత సహాయకుడు సీహెచ్ కిరణ్ పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు..
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు యత్నించిన బీజేపీ కుట్రకు నిరసనగా గురువారం మణుగూరు పట్టణంలో జడ్పీటీసీ పాశం నరసింహారావు ఆధ్వర్యంలో నాయకులు తెలంగాణ భవన్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ర్యాలీలో పార్టీ పట్టణ అధ్యక్షుడు ముత్యంబాబు, సొసైటీ అధ్యక్షుడు కురి నాగేశ్వరరావు పాల్గొన్నారు. నేలకొండపల్లి మండల కేంద్రంలో పార్టీ మండల అధక్షుడు ఉన్నం బ్రహ్మయ్య ఆధ్వర్యంలో నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎంపీపీ వజ్జా రమ్యా, సీడీసీ చైర్మన్ నెల్లూరి లీల పాల్గొన్నారు. తల్లాడ మండల కేంద్రంలో ఎంపీపీ దొడ్డా శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రెడ్డి మోహన్‌రెడ్డి, జడ్పీటీసీ దిరిశాల ప్రమీల, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు శీలం కోటారెడ్డి నిరసన ర్యాలీ చేపట్టారు. వైరా, కారేపల్లి, బోనకల్, ముదిగొండ, మధిర, కల్లూరు, కొణిజర్ల, కామేపల్లి, చింతకాని, పెనుబల్లితో పాటు అన్ని మండలాల్లోనూ నాయకులు ఇదే విధంగా నిరసన వ్యక్తం చేశారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

