వినోద్‌కుమార్‌ను గెలిపించుకుందాం
కరీంనగర్ ఎంపీ గా బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకొని.. ఈ ప్రాంత అభివృద్ధికి బాటలు వేసుకుందామని జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు పిలుపునిచ్చారు.
- అభివృద్ధికి బాటలు వేసుకుందాం
- జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు
ఇల్లంతకుంట, మే11: కరీంనగర్ ఎంపీ గా బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకొని.. ఈ ప్రాంత అభివృద్ధికి బాటలు వేసుకుందామని జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు పిలుపునిచ్చారు. శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం సిద్దిపేట నుంచి ఇల్లంతకుంట వరకు 82 కోట్లతో నాలుగు లైన్ల రోడ్డు మంజూరు చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుని నల్గొం డ జిల్లాకు ఈ నిధులను మళ్లించిందని ఆరోపించారు.
ఈ నిధులను మళ్లిస్తే ఎమ్మె ల్యే సత్యనారాయణ ఏం చేస్తున్నారని ప్రశించారు. ఆరు గ్యారెంటీ హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని మం డిపడ్డారు. ఎంపీగా వినోద్ కుమార్‌ను గెలిపిస్తే పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుక అవుతారన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి, ఎంపీటీసీ ఒగ్గు నర్సయ్య, పీఏసీఎస్ చైర్మన్ రోండ్ల తిరుపతిరెడ్డి, నాయకులు వేణురావు, కేవీఎన్ రెడ్డి, కట్ట వెంకట్‌రెడ్డి, అనిల్ రఘు, వెంకన్న, తూటి పరశురాం, శ్రీనివాస్
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

