Road Accident | చందుర్తి, ఆగస్టు 2 : రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడికి తీవ్ర గాయాలైన ఘటన ఎన్గల్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. ఎన్గల్ గ్రామానికి చెందిన పులి ప్రణయ్ ద్విచక్ర వాహనం పై శుక్రవారం రాత్రి బండపల్లి గ్రామానికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో గ్రామ శివారులో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడడంతో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గమనించిన స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో అంబులెన్స్ సహాయంతో వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.