కాసేపైతే క్షేమంగా ఇంటికి.. అంతలోనే మృత్యుఒడికి
పని ముగించుకొని కాసేపట్లో ఇంటికి చేరాల్సిన ఆ యువకుడు అనుకోని ప్రమాదంలో మృత్యు ఒడికి చేరాడు. పెగడపల్లి మండలం బతికపల్లి వద్ద గుర్తు తెలియని వాహనం, బైక్ ఢీకొన్న ప్రమాదంలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
- రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
- మరొకరి పరిస్థితి విషమం
- బతికపల్లి వద్ద బైక్‌ను ఢీకొన్న గుర్తు తెలియని వాహనం
- సుద్దపల్లిలో విషాదం
పెగడపల్లి, జూన్ 26: పని ముగించుకొని కాసేపట్లో ఇంటికి చేరాల్సిన ఆ యువకుడు అనుకోని ప్రమాదంలో మృత్యు ఒడికి చేరాడు. పెగడపల్లి మండలం బతికపల్లి వద్ద గుర్తు తెలియని వాహనం, బైక్ ఢీకొన్న ప్రమాదంలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరోవ్యక్తి తీవ్ర గాయాలతో దవాఖానలో చేరాడు. పోలీసుల వివరాల ప్రకారం.. పెగడపల్లి మండలం సుద్దపల్లికి చెందిన బలుసు గంగాధర్(28), ముంజ రాజు ఇద్దరు కలిసి బుధవారం ఉదయం బైక్‌పై పనికోసం పెగడపల్లికి వచ్చారు. పని పూర్తి చేసుకొని సాయంత్రం తిరుగుపయనమయ్యారు. మరో ఐదు నిమిషాల్లో ఇంటికే చేరేవారు.
కానీ, మరో రెండు కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉండగా.. బతికపల్లి శివారు.. సుద్దపల్లి సమీపంలో వీరి బైక్‌ను ఎదురుగా వస్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ఘటనలో గంగాధర్ తలకు బలమైన దెబ్బలు తగలడంతో అక్కడికక్కడే చనిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ రాజును ‘108’లో జగిత్యాల దవాఖానకు, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ దవాఖానకు తరలించారు. రాజు పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పెగడపల్లి ఎస్ఐ జాడి రామకృష్ణ పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు తెలిపారు. సీసీ ఫుటేజీలను పరిశీలించి వాహనాన్ని గుర్తిస్తామని చెప్పారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

