Thimmapur | తిమ్మాపూర్, జనవరి 20 : మహిళలు అన్ని రంగాల్లో ఆర్థికంగా అభివృద్ధి చెందాలని బీఆర్ఎస్ నాయకుడు ఉల్లెంగుల ఏకానందం సూచించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పర్లపల్లి, వచ్చునూర్ గ్రామాల్లో మహిళా సంఘాల భవనాలకు ఉల్లెంగుల సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏకానందం ఫర్నీచర్ అందజేశారు. ఈ సందర్భంగా ఉల్లెంగుల ఏకానందం మాట్లాడారు. ఇప్పటికే తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో మండలంలోని గ్రామాల్లో పలు సేవా కార్యక్రమాలు చేశామన్నారు.
భవిష్యత్తులో కూడా గ్రామ ప్రజలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని స్పష్టం చేశారు. జడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం ఏకానందంకు మహిళా సంఘం సభ్యులు శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ చిందం విజయలక్ష్మి చంద్రమౌళి, గ్రామ శాఖ అధ్యక్షుడు తాటిపల్లి చంద్రమౌళి, హర్షవర్దన్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ సుద్దాల రాజేష్, యాదగిరి, వీవోఏ న్యాలం రజిత, గొల్లపల్లి సుజాత, కమటం రమాదేవి, వీవో ఓబీలు, బండారి కుమారస్వామి, తిరుపతి, తాజోద్దిన్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.