VemulaWada | రాజకీయంగా ఎదగాలి.. సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివాజీ
ఆరె కులస్తులు రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉందని అరె సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెట్టుపల్లి శివాజీ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆరె, ఆర్య క్షత్రియ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సిలువేని మల్లేశం ఆధ్వర్యంలో జిల్లాలోని పలు గ్రామా ఆరె, ఆర్య క్షత్రియ కులానికి చెందిన సర్పంచులు, ఉప సర్పంచులుగా ఎన్నికైన సందర్భంగా వేములవాడ పట్టణంలోని హరిమల గార్డెన్ లో ఘన సన్మానం గావించారు.
- వేములవాడలో ఆరే, ఆరె క్షత్రియ జిల్లా సంక్షేమం ఆధ్వర్యంలో సర్పంచులకు సన్మానం
VemulaWada | వేములవాడ, జనవరి 8: ఆరె కులస్తులు రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉందని అరె సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెట్టుపల్లి శివాజీ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆరె, ఆర్య క్షత్రియ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సిలువేని మల్లేశం ఆధ్వర్యంలో జిల్లాలోని పలు గ్రామా ఆరె, ఆర్య క్షత్రియ కులానికి చెందిన సర్పంచులు, ఉప సర్పంచులుగా ఎన్నికైన సందర్భంగా వేములవాడ పట్టణంలోని హరిమల గార్డెన్ లో ఘన సన్మానం గావించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా శివాజీ మాట్లాడుతూ రాష్ట్రంలో 10 లక్షల కు పైగా జనాభా కలిగి ఉండగా 8 నుండి 10 నియోజకవర్గాల్లో గెలుపును నిర్దేశించే విధమైన ఓటర్లు కలిగి ఉన్నామని చెప్పారు. గ్రామపంచాయతీ నుండి జరిగే ప్రతి ఏ ఎన్నికైన ప్రతి ఒక్కరు పోటీలో నిలుచుని రాజకీయంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. జనాభా ప్రతిపాదికన మనకు రావలసిన ప్రతి హక్కును ప్రభుత్వం ద్వారా రాబట్టుకుందామని పిలుపునిచ్చారు.
అనంతరం నూతనంగా ఎన్నికైన గ్రామాల సర్పంచులు ఇటిక్యాల రాజు, ఎండ్రాల ప్రసాద్, సాండేసారి సౌజన్య -మల్లికార్జున్, కౌడేగానీ వెంకటేష్, ఇరువల సౌందర్య మహేందర్, మోహన్ రావు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులతో కలిసి 42 మందిని ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంఘం అధ్యక్షుడు సిలువేరి మల్లేశం, ప్రధాన కార్యదర్శి ఎండ్రాల అశోక్, ఉపాధ్యక్షులు సూరదేవరావు, రాష్ట్ర నాయకులు సూరారం శివాజీ, జెండా రాజేష్, మనోహర్, ఇటికాల లింగయ్య తదితరులు ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLC Botsa | ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదు..కేంద్రబలగాలను రప్పించాలి : ఎమ్మెల్సీ బొత్స
Delhi-NCR | ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం.. గ్రాప్-1 ఆంక్షలు అమలు
ఎక్కువ ఈఎంఐ కట్టడమా?.. కాల వ్యవది పెంచుకోవమా?.. ఆర్బీఐ వడ్డీరేటు పెంచిన తరువాత ఏది బెటర్
Trishula Snanarchana | వేయిస్తంభాల ప్రాచీనకోనేరులో త్రిశూలస్నానార్చన
Theft Attempt | దొంగతనం చేసేందుకు సీసీ కెమెరాను బ్లర్ చేశారు.. కానీ ఏమైందో చూడండి.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

