Odela | ఓదెల, జూన్ 19 : పెద్దపల్లి జిల్లా ఓదెల తహసీల్దార్ గా బాణావత్ వనజా నాయక్ శుక్రవారం ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. డిప్యూటీ కలెక్టర్ గ్రూప్-1 అధికారి అయిన వనజ నాయక్ ఓదెల తహసీల్దార్ గా పోస్టింగ్ ఇచ్చారు. దీంతో ఆమె బాధ్యతలు తీసుకున్నారు. కాగా ఇంతకాలం తహసీల్దారుగా వ్యవహరించిన డిప్యూటీ తహసీల్దార్ ధీరజ్ కుమార్ గౌడ్ ప్రస్తుతం కొనసాగనున్నారు. నూతనంగా వచ్చిన తహసీల్దార్ కు రెవెన్యూ సిబ్బంది పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.