Vemulawada | వేములవాడ రూరల్, సెప్టెంబర్ 22 : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో దొంగతనం జరిగింది. వేములవాడ్ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలోని ఒక ఫ్యాన్ తో పాటు ఇంటర్నెట్ కు సంబంధించిన వైర్ తదితర వస్తువులు చోరీకి గురయ్యాయి. మండల పరిషత్ కార్యాలయం వెనుక భాగం నుండి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి లోపలికి చొరబడి పైన ఉన్న సీలింగ్ ఫ్యాన్‌ను దొంగలించడంతోపాటు ఇంటర్నెట్ వైర్ ను తదితర వస్తువులను ఎత్తుకెళ్లాడు. ఉదయం వచ్చిన ఆఫీస్ సిబ్బందికి వెనక డోర్ తెరిచి ఉండడంతో పాటు ఫ్యాన్ చోరీకి గురైనట్టు కార్యాలయ సిబ్బంది పేర్కొన్నారు. చోరీ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎంపీడీవో శ్రీనివాస్ పేర్కొన్నారు.