Godavarikhani | అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వమే న్యాయం చేయాలి.. ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్త
అగ్రి గోల్డ్ బాధితులు కోల్పోయిన సొమ్మును తిరిగి ఇప్పించి న్యాయం చేయాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపై ఉందని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్ డిమాండ్ చేశారు. కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణిలో బాధితుల పక్షాన సోమవారం వినతి పత్రం అందజేశారు.
- ఇచ్చిన హామీని మరిచిన సీఎం రేవంత్ రెడ్డి
- మాట నిలబెట్టుకోవాలని సూచన
Godavarikhani | కోల్ సిటీ, అక్టోబర్ 12 : అగ్రి గోల్డ్ బాధితులు కోల్పోయిన సొమ్మును తిరిగి ఇప్పించి న్యాయం చేయాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపై ఉందని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్ డిమాండ్ చేశారు. కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణిలో బాధితుల పక్షాన సోమవారం వినతి పత్రం అందజేశారు. దినేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వంద రోజుల్లో అగ్రి గోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసినట్టే అగ్రి గోల్డ్ బాధితులను నమ్మించి మోసం చేశాడని ఆరోపించారు. సంస్థలో డబ్బులు పొదుపు చేస్తే కుటుంబ అవసరాలకు, పిల్లల ఉన్నత చదువులకు ఉపయోగపడతానే లక్షలాది మంది ప్రజలు పెట్టుబడులు పెట్టి మోసపోయారన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వం బాధితులకు అండగా నిలిచే చర్యలు చేపడుతుందనీ, ఆ ప్రభుత్వంను చూసైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. నిపుణులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. తెలంగాణలో సుమారు 3లక్షల మంది బాధితులు ఉన్నారనీ, అగ్రి గోల్డ్ ఆస్తులను చట్టబద్ధంగా వేలం వేసి బాధితులకు రావల్సిన సొమ్మును తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో బాధితుల పక్షాన పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

