Veenavanka | వీణవంక, కోర్కల్ చేనేత సంఘాల ఎన్నిక ఏకగ్రీవం.. నూతన చైర్మన్లుగా పద్మలత, సత్యనారాయణ
వీణవంక మండలంలోని వీణవంక, కోర్కల్ చేనేత సహకార సంఘాలకు ప్రభుత్వం ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయగా ఆదివారం చైర్మన్లతో పాటు పాలకవర్గ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
Veenavanka | వీణవంక, జూన్ 21 : వీణవంక మండలంలోని వీణవంక, కోర్కల్ చేనేత సహకార సంఘాలకు ప్రభుత్వం ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయగా ఆదివారం చైర్మన్లతో పాటు పాలకవర్గ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. వీణవంక, కోర్కల్ చేనేత సహకార సంఘంలో ఒక్కో డైరెక్టర్ స్థానానికి ఒకటే నామినేషన్ దాఖలు కాగా ఎన్నిక ఏకగ్రీవం అయ్యాయి.
వీణవంక చేనేత సంఘం చైర్మన్ గా జడల పద్మలత, వైస్ చైర్మన్ గా ఉయ్యాల రాజయ్య, కోశాధికారిగా చిందం సదానందం, కోర్కల్ చేనేత సంఘం చైర్మన్ గా అడిగొప్పుల సత్యనారాయణ, వైస్ చైర్మన్‌గా అడిగొప్పుల నిర్మల, కోశాధికారిగా బొద్దుల భావనరుషిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఎన్నికల అధికారులు రూప, సురేందర్‌రెడ్డి, అక్బర్లు తెలిపారు. అనంతరం వీరితో పాటు డైరెక్టర్లకు ఎన్నికల అధికారులు నియామకపత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికయిన వారికి మాజీ చైర్మన్ జడల రమేష్ తో పాటు సభ్యులు పూలమాళలు వేసి, శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఇక్కడ నూతన పాలకవర్గం, చేనేత సహకార సంఘం సభ్యులు, పెద్దలు ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

