Tula Uma | దీక్షా దివాస్ సభకు ఇల్లిల్లు కదలిరావాలి.. ఉమ్మడి కరీంనగర్ మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ
దీక్షా దివాస్ సభకు ప్రజలు అందరూ కదలి రావాలని జడ్పి మాజీ చైర్మన్ తుల ఉమ పిలుపునిచ్చారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని 3వ వార్డులో గురువారం దీక్ష దివాస్ సభ పురస్కరించుకుని మున్సిపల్ చైర్మన్ జిందం కళ తో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
- సిరిసిల్లలో ఇంటింటా మహిళలకు బొట్టు పెట్టి సభకు రావాలని ఆహ్వానం
Tula Uma | సిరిసిల్ల టౌన్ , నవంబర్ 26 : దీక్షా దివాస్ సభకు ప్రజలు అందరూ కదలి రావాలని జడ్పి మాజీ చైర్మన్ తుల ఉమ పిలుపునిచ్చారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని 3వ వార్డులో గురువారం దీక్ష దివాస్ సభ పురస్కరించుకుని మున్సిపల్ చైర్మన్ జిందం కళ తో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక యువతులు, మహిళలకు బొట్టు పెట్టి సభకు రావాలని ఆహ్వానించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ చేపట్టిన నవంబర్ 29 ఆమరణ దీక్ష చారిత్రాత్మక మలుపుగా నిలిచిందని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. దీక్షా దివస్‌ను పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా అల్గునూరులో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. 2001లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీని స్థాపించి, తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా అన్ని వర్గాల ప్రజలను ఏకం చేస్తూ ఉద్యమాన్ని ప్రారంభించారని గుర్తుచేశారు.
ఉద్యమం అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటున్న సమయంలో 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పి, రాష్ట్ర సాధన పోరాటాన్ని మరింత ఉధృతం చేసిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో దీక్షా దివస్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందని, ఆ చారిత్రాత్మక ఘట్టాన్ని భవిష్యత్ తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో అల్గునూరులో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని బీఆర్ఎస్ నాయకులు కోరారు. మున్సిపల్ చైర్మన్ జిందం కళ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమస్ఫూర్తిని, రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన పోరాట పోరాట ఆకాంక్షను నేటి తరానికి తెలియజేయడమే లక్ష్యంగా దీక్ష దివాస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారని తెలిపారు. యువతలు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ వేముల రాములు, బీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు వెంగళ శ్రీనివాస్, పట్టణ మహిళా విభాగ అధ్యక్షురాలు బత్తుల వనజ , చేరాల స్వాతి, పద్మ, నీలిమ , సయ్యద్ షాదబ్, మహిళలు బీడీ కార్మికులు వారు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Biker | బైకర్‌ను ఢీకొట్టిన కార్లు.. ఏం జరిగిందో చూడండి.. వీడియో
Hotel Demolish Attempt | ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకు హోటల్ తొలగింపునకు యత్నం.. బాధితుడు ఆందోళన
Professor D Rajireddy | అగ్రోమెటియరాలజీలో ప్రొఫెసర్ డి. రాజిరెడ్డికి గౌరవ ఫెలోషిప్ ప్రదానం
Dementia | డిమెన్షియా అంటే ఏమిటి.. మతిమరుపుకు, దీనికి ఏమిటి సంబంధం..?
Prabhas | బాహుబలి కాంబో మరోసారి రిపీట్ కాబోతోందా …2028 తర్వాత రాజమౌళి భారీ ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ

