Siricilla | పది రోజులుగా సమ్మె.. అయినా స్పందన కరువు..!,, ఒంటికాలిపై నిలబడి ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
హక్కుల సాధన కోసం జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె పది రోజులు దాటినా సమస్యకు పరిష్కారం దిశగా స్పష్టమైన అడుగులు కనిపించడం లేదని ఉద్యోగ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
- హక్కుల కోసం ఎండనక, వాననక ఆందోళన
- ప్రభుత్వానికి కనిపించని ఎన్హెచ్ఎం ఉద్యోగుల ఆవేదన..?
- చర్చలకు పిలిచే వరకూ సమ్మె విరమించేది లేదని హెచ్చరిక
Siricilla | రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్, అక్టోబర్ 22 : హక్కుల సాధన కోసం జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె పది రోజులు దాటినా సమస్యకు పరిష్కారం దిశగా స్పష్టమైన అడుగులు కనిపించడం లేదని ఉద్యోగ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. రోజుకో రూపంలో నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వం నుంచి చర్చలకు పిలుపు రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించే వరకు సమ్మె కొనసాగిస్తామని ఎన్హెచ్ఎం జేఏసీ స్పష్టం చేసింది. రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ధర్నా చౌక్ ప్రాంగణంలో గురువారం సమ్మెలో భాగంగా ఉద్యోగులు ఒంటికాలిపై నిలబడి, ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని నినదించారు.
హామీలకే పరిమితమా.. ఉద్యోగుల భవితవ్యం ఎటు?
రెగ్యులరైజేషన్, మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, ఆరోగ్య భద్రత, పీఆర్సీ, 51 శాతం ఇంక్రిమెంట్, ఉద్యోగ భద్రత కల్పించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజారోగ్య వ్యవస్థలో కీలక సేవలు అందించే సిబ్బంది తమ భవిష్యత్తుపై భరోసా కోరుతుంటే, వారి డిమాండ్లపై ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. ఒకవైపు ఉద్యోగుల ఆందోళన రోజురోజుకూ తీవ్రతరం అవుతుండగా, మరోవైపు సమ్మె ప్రభావం ఆరోగ్య సేవలపై ఎలా పడుతోందన్నది కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఉద్యోగుల సమస్యల పరిష్కారంతో పాటు ప్రజలకు వైద్య సేవల్లో ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
సమ్మె ఎన్నిరోజులు కొనసాగుతుంది? చర్చలకు ప్రభుత్వం ఎప్పుడు పిలుస్తుంది? ఉద్యోగుల డిమాండ్లపై స్పష్టమైన నిర్ణయం ఎప్పుడు వెలువడుతుంది? అన్న ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది. నిరసనలు మరింత ఉధృతం కాకముందే ప్రభుత్వం చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం చూపాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలతో పాటు ఎన్హెచ్ఎం ఉద్యోగులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | ‘రణబాలి’ గ్రాండ్ సక్సెస్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎక్కడంటే?
Mercedes Benz | హైదరాబాద్‌లో మహావీర్ మోటార్స్ సరికొత్త రికార్డ్.. దసరా కానుకగా 50 మెర్సిడేస్ బెంజ్ కార్ల డెలివరీ.. !
Odisha Athletes | కటక్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు ఒడిశా అథ్లెట్ల మృతి.. సీఎం సంతాపం
Annamalai | ‘12 ఏళ్లుగా అధికారంలో ఉన్నా, శతృవులను సృష్టించుకోవాల్సి వస్తున్నది’.. బీజేపీపై అన్నామలై విమర్శలు
NZvIND: గ్లెన్ ఫిలిప్స్ 82 నాటౌట్.. ఇండియా టార్గెట్ 226
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

