Oggu Katha | వేములవాడ, ఆగస్టు 3 : అగ్రరాజ్యమైన అమెరికా గడ్డమీద తెలంగాణ జానపదం అలరించింది. ఓక్లాండ్ అరేనాలో జరిగిన సిలికాన్ ఆంధ్ర రజిత వేడుకల్లో భాగంగా మిద్దె వినీత్ బృందం తెలంగాణ జానపద కళ ఒగ్గు కథతో ప్రదర్శించారు. ఏడంతరాల బోనంతో కూడా చేసిన నిత్య ప్రదర్శన తెలుగువారిని మంత్రముగ్ధులను చేసింది. తెలంగాణ రాష్ట్రంలో జానపద కళ పితామహుడు దివంగత మిద్దె రాములు వారసులుగా పరుశరాములు, వినీత్ అందిపుచ్చుకొని అనేక వేదికల ద్వారా ప్రదర్శనలు నిర్వహించారు.
సిలికాన్ ఆంధ్ర రజితోత్సవ వేడుకల్లో అమెరికా వేదికగా ప్రదర్శన చేపట్టాలని అందిన ఆహ్వానం మేరకు వారు అమెరికా చేరుకొని అక్కడి తెలుగువారిని తెలంగాణ జానపద ఒగ్గు కథ, బోనాల నృత్యాలతో అలరింపజేసి ఆకట్టుకున్నారు. అమెరికా వేదికగా ప్రదర్శన ఇచ్చిన ఈ బృందాన్ని తెలంగాణ ఒగ్గు కథ కళాకారులు వారికి శుభాకాంక్షలు తెలిపారు.