‘ట్యాబ్’ గిరిజన విద్యార్థులకు ‘గిఫ్ట్’
మంత్రి కేటీఆర్ గిఫ్ట్ఏ స్మైల్ కిం ద అందించిన ట్యాబ్‌లు గిరిజన విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఆకాశ్ బైజూస్ సాఫ్ట్‌వేర్‌తో కూడిన రూ.80వేల ఖరీదు చేసే ఈ మినీ కంప్యూటర్లు వారి విద్యాభివృద్ధికి తోడ్పడుతున్నాయి. ప్రతి సబ్జెక్టుపై అవగాహన పెంచుకునేందుకు ఎంతగానో ఉపకరిస్తున్నాయి. ఐఐటీ, నీట్‌కు, సీయూసెట్‌లో మెరుగైన ఫలితాల సాధనకు తోడ్పడుతున్నాయి.
- దుమాల ఏకలవ్య గురుకుల స్టూడెంట్స్‌కు ట్యాబ్‌ల పంపిణీ
- మంత్రి కేటీఆర్ గిఫ్ట్ ఏ స్మైల్ కింద అందజేత
- సబ్జెక్టుపై సంపూర్ణ అవగాహన
- నీట్, ఐఐటీ, సీయూసెట్కు సిద్ధమవుతున్న స్టూడెంట్స్
ఎల్లారెడ్డిపేట, మే 17: మంత్రి కేటీఆర్ గిఫ్ట్ఏ స్మైల్ కిం ద అందించిన ట్యాబ్‌లు గిరిజన విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఆకాశ్ బైజూస్ సాఫ్ట్‌వేర్‌తో కూడిన రూ.80వేల ఖరీదు చేసే ఈ మినీ కంప్యూటర్లు వారి విద్యాభివృద్ధికి తోడ్పడుతున్నాయి. ప్రతి సబ్జెక్టుపై అవగాహన పెంచుకునేందుకు ఎంతగానో ఉపకరిస్తున్నాయి. ఐఐటీ, నీట్‌కు, సీయూసెట్‌లో మెరుగైన ఫలితాల సాధనకు తోడ్పడుతున్నాయి. మంత్రి కేటీఆర్ గిఫ్ట్ఏస్మైల్లో ఎల్లారెడ్డిపేట మండలంలోని దుమాల ఏకలవ్య గురుకుల స్కూల్‌కు చెం దిన 48 మంది విద్యార్థులకు మంత్రి కేటీఆర్ గిఫ్ట్ఏస్మైల్లో భాగంగా బైజ్యూస్ సాఫ్ట్‌వేర్‌తో కూడిన ట్యాబ్‌లను అందజేశారు. వీటిని స్టూడెంట్స్ సద్వినియోగం చేసుకుంటున్నారు. ఐఐటీ, నీట్ లాంటి పరీక్షలకు సిద్ధమై సత్ఫలితాలు సాధించారు.
ఐఐటీ, నీట్‌కు క్వాలీఫై…
ఇటీవల విడుదలైన ఐఐటీ, నీట్ మెయిన్స్ ఫలితాల్లో ఐఐటీకి తొమ్మిది మంది విద్యార్థులు జరుపుల సుజాత, ఇస్లావత్ అర్పిత, భూక్యా సులోచన, మాలావత్ గంగ, ఇస్లావత్ పూజిత, చౌహన్ రవీనా, పెండోర్ శిరీష, రాథోడ్ కావేరీ, డీ బింధు ఐఐటీ మంచి పర్సంటైజ్ సాధించి మెయిన్స్‌కు క్వాలీఫై కాగా జూన్ 4న జరుగనున్న అడ్వాన్స్ కోసం వరంగల్‌లో గిరిజన గురుకులంలో శిక్షణ తీసుకుంటున్నారు. అలాగే ఇద్దరు నీట్‌కు అర్హత సాధించారు. కాలే జ్ ఆఫ్ ఎక్సలెన్స్ కళాశాలలోని క్లాసులతో పాటు ట్యాబ్‌లో ఆకాశ్ బైజూస్ ఆన్లైన్ తరగతులు సబ్జెక్టుపై పట్టు సాధించేందుకు దోహద పడిందని విద్యార్థులు చెబుతున్నారు.
కేటీఆర్ సార్‌కు థాంక్స్
మాది పెద్దపల్లి జిల్లా దధ్మరం మండలం కొత్తపల్లి, నేను బైపీసీ పూర్తి చేసి నీట్ కోసం ప్రిపేరవుతున్నాను. ఈ సమయంలో మాకు ఇచ్చిన ట్యాబ్ బాగా ఉపయోగపడుతుంది. నీట్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న అన్ని క్వశ్చన్ పేపర్ మాడల్స్ ఉన్నవి. ట్యాబ్‌తో ప్రాక్టీస్ చేస్తున్న. ఇంత మంచి ట్యాబ్‌ను మాకు అందించినందుకు కేటీఆర్ సార్‌కు కృతజ్ఞతలు.
– అజ్మీరా అనిల్, బైపీసీ, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ కళాశాల, దుమాల (ఎల్లారెడ్డిపేట)
ఐఐటీకి ప్రిపేరవుతున్న
మాది బావుసాయిపేట మండలం గోవిందరావుపల్లి తండా మా అమ్మనాన్నలు వ్యవసాయమే చేస్తరు. కేటీఆర్ సార్ ఇచ్చిన ట్యాబ్‌ను ఉపయోగించుకుని నేను ఐఐటీ ప్రిపేరవుతున్నాను. మా సార్లు కూడా పాఠాలు బాగానే చెప్పారు కానీ ఇంకా సబ్జెక్ట్ ఏదైనా మిస్సయితదేమో అనుకున్న. కానీ మాకు ఇచ్చిన ట్యాబ్‌తో మొత్తం లెస్సన్స్ అందులో విని అర్థం కానివి కూడా అర్థం అయ్యేలా, డౌట్స్‌ను కూడా క్లియర్ చేసుకుంటున్న.
– లావుడ్య రాజేశ్వరి, ఎంపీసీ , ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ కళాశాల, దుమాల (ఎల్లారెడ్డిపేట)
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- Gift
- GiftA Smile
- KTR
- TAB
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

