వివాదాస్పదం.. విద్యాశాఖ సస్పెన్షన్లు
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని నవాబుపేట, సైదాపూర్ మండలంలోని తండా ప్రాథమిక పాఠశాలల్లో ఎస్జీటీలు ఏ మంగ, బీ సునీతను సస్పెండ్ చేస్తూ డీఈవో ఈ నెల 18న ఉత్తర్వులు జారీ చేశారు. సదరు పాఠశాల్లో ఇతరులు నివసిస్తున్నారనే కారణాలు చూపుతూ వారిని సస్పెండ్ చేశారు. ఈ రెండు మండలాల ఎంఈవోలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
- హాట్ టాపిక్‌గా మహిళా టీచర్ల సస్పెన్షన్
- నిబంధనలకు విరుద్ధమంటున్న ఉపాధ్యాయులు
- వివరణ కోరకుండానే చర్యలు ఎలా తీసుకుంటారని ఆవేదన
- సంఘాల స్పందన తీరు నామమాత్రమేనంటూ తీవ్ర విమర్శలు
- నాయకులు సస్పెండ్ అయినప్పుడు ఐక్యతారాగం
- ఇప్పుడేమో చేతులు దులుపుకునే ప్రయత్నాలు
- సోషల్ మీడియా వేదికగా తూర్పార
- సభ్యత్వం, స్వప్రయోజనాల కోసమే తప్ప న్యాయం వైపు నిలబడడం లేదంటూ ఘాటుగా ఆరోపణలు
- విద్యాశాఖలో వింత పోకడలు
ఇటీవల ఇద్దరు మహిళా టీచర్లను సస్పెండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా విద్యాశాఖ ఇచ్చిన ఉత్తర్వులు ప్రస్తుతం వివాదాస్పదమవుతున్నాయి. పాఠశాలకు వెళ్లాలంటూ అధికారికంగా ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోగా.. కనీసం వివరణ తీసుకోకుండానే విధుల నుంచి ఎలా తొలగిస్తారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. టీచర్ల సస్పెన్షన్ అన్యాయమంటూ ఉపాధ్యాయులు బాహాటంగా చెప్పడంతోపాటు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు బాధితులు నానా తంటాలు పడుతున్నారు. ఉపాధ్యాయ సంఘాల తీరును సోషల్ మీడియా వేదికగా వేలాది మంది టీచర్లు తప్పు పడుతున్నారు. పదో తరగతి స్పాట్ సందర్భంగా ఇద్దరు సంఘ నాయకులను సస్పెండ్ చేస్తే.. ఎత్తివేసే వరకు ఒక్కతాటిపైకి వచ్చి పోరాడిన అన్ని సంఘాలు.. మహిళా ఉపాధ్యాయుల విషయంలో ఎందుకు చొరవ చూపడం లేదని ప్రశ్నలవర్షం కురిపిస్తున్నారు. నాయకులకైతే ఓ నీతి.. సాధారణ ఉపాధ్యాయులకైతే మరో నీతా..? అంటూ సంఘ నాయకులను తూర్పార పడుతున్నారు. సభ్యత్వాలు, స్వప్రయోజనాలు తప్ప నిబంధనలకు విరుద్ధంగా జరిగిన సస్పెన్షన్లపై ఎందుకు నోరు మెదపడం లేదంటూ ప్రశ్నిస్తున్న తీరు ప్రస్తుతం కరీంనగర్ జిల్లా విద్యాశాఖలో చర్చనీయాంశంగా మారింది.
కరీంనగర్, మే 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని నవాబుపేట, సైదాపూర్ మండలంలోని తండా ప్రాథమిక పాఠశాలల్లో ఎస్జీటీలు ఏ మంగ, బీ సునీతను సస్పెండ్ చేస్తూ డీఈవో ఈ నెల 18న ఉత్తర్వులు జారీ చేశారు. సదరు పాఠశాల్లో ఇతరులు నివసిస్తున్నారనే కారణాలు చూపుతూ వారిని సస్పెండ్ చేశారు. ఈ రెండు మండలాల ఎంఈవోలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇదే రోజు కరీంనగర్‌లోని ఫకీర్‌నగర్ ప్రాథమికోన్నత పాఠశాల్లో ఎస్జీటీ ఎన్ మంజుల చాలా రోజులుగా గైర్హాజరు కావడంతో సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఈ విషయంలో పాఠశాల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు, కరీంనగర్ ఎంఈవోను వివరణ కోరినట్టు అందులో పేర్కొన్నారు. అయితే పాఠశాలల్లో ఇతరులు నివిస్తున్నారనే కారణం తో ఇద్దరు మహిళా టీచర్లపై వేటు వేయడం ప్రస్తుతం విద్యాశాఖలో వివాదాస్పదమవుతున్నది. ఈ విషయం లో సంఘాలు అనుసరిస్తున్న తీరు సోషల్ మీడియాలో పెద్ద దూమారమే లేపుతున్నది.
సస్పెన్షన్లు చర్చనీయాంశం
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేస్తూ ఇటీవల కాంగ్రెస్ సర్కారు నిర్ణయం తీసుకున్న విష యం తెలిసిందే. పాఠశాల ప్రారంభానికి ముందే.. పలు పాఠశాలల్లో రిపేర్ చేయాల్సిన పనుల కోసం కొన్ని నిధులను ఈ పథకం కింద కేటాయించింది. ఈ పనులు సాగుతున్న నేపథ్యంలో ప్రతి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మే ఒకటి నుంచి పాఠశాలలకు వెళ్లాల్సిందిగా జిల్లా విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. కానీ, ఈ ఆదేశాలను ప్రాథమిక పాఠశాలలకు జారీ చేయలేదు. కనీసం మౌఖిక ఆదేశాలు కూడా ఇవ్వలేదు. వేసవి సెలవులు కావడంతో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఇంటి వద్దే ఉన్నారు. కాగా, ఇటీవల నవాబుపేట, తండా పాఠశాలలను ఉన్నతాధికారులు తనిఖీ చేయగా, ఆ స్కూళ్లలో ఇతరులు నివసిస్తున్నట్టు గుర్తించారు. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని.. సదరు పాఠశాలల్లో పనిచేస్తున్న ఇద్దరు మహిళా ఉపాధ్యాయులను జిల్లా విద్యాశాఖ సస్పెండ్ చేస్తూ ఈ నెల 18న ఉత్తర్వు లు జారీ చేసింది. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధమని ఉపాధ్యాయులు చెబుతున్నారు. నిజానికి పాఠశాలలకు వెళ్లాలని తమకు ఆదేశాలు రాలేదని, ఎవరో నివసిస్తున్న విషయం తమ దృష్టికి రాలేదని సదరు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ఒక వేళ ఉన్నతాధికారులు గుర్తించిన సమయంలో తమకు సమాచారమిస్తే వారిని ఖాళీ చేయించే వాళ్లమని, తమతో ఆ పని కానప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చే వాళ్లమని స్పష్టం చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలను తాము ధిక్కరించినా.. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చూపినా.. తమ ను బాధ్యులను చేస్తే తప్పులేదు కానీ, తమకు సంబం ధం లేని విషయంలో తమను బలిచేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇది ఇద్దరు మహిళా టీచర్లకు జరిగిన అన్యాయంగా భావించడం లేదని, ఇలాగే కొనసాగితే మరింత మంది ఉపాధ్యాయులు బలి కావాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అలాగే ఉన్నతాధికారుల దృష్టికి విషయం వచ్చినప్పుడు.. తమను వివరణ కోరితే బాగుండేదని, తమ వర్షన్ తీసుకోకుండానే ఏకపక్షంగా ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. మహిళా టీచర్లకు జరిగిన అన్యాయాన్ని ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లేందుకు.. కొంత మంది ఉపాధ్యాయులు నానా తంటాలు పడుతున్నారు.
సోషల్ మీడియా వేదికగా తూర్పార
పాత అంశంతోపాటు ఇప్పుడు మహిళా టీచర్ల సస్పెన్షన్ వ్యవహారాన్ని పలువురు ఉపాధ్యాయులు సోషల్ మీడియా వేదికగా తూర్పార పడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మహిళా టీచర్ల సస్పెన్షన్ జరిగిందం టూ ముక్తకంఠంతో చెబుతున్నారు. జరిగిన అన్యాయా న్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, సదరు టీచర్లకు న్యాయం జరిగేలా పోరాడాల్సిన సంఘాలు ‘ఎవరికి వారే యమునా తీరే’ అన్నట్టు ప్రవర్తిస్తున్నాయని మండిపడుతున్నారు. నాయకుల సస్పెన్షన్ విషయంలో ఏకతాటిపైకి వచ్చిన సంఘాలు, ప్రస్తుతం మాత్రం ఏకతాటిపైకి రాకుండా విడివిడిగా అధికారులను కలువడం వెనుక ఆంతర్యమేంటని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ‘కేవలం సభ్యత్వాలు, స్వప్రయోజనాల కోసమే సంఘాలు పనిచేస్తయా..? ఉపాధ్యాయులకు అన్యా యం జరిగితే అండగా నిలువవా..? తన వరకు వస్తే అని ఆలోచించే ధోరణి నాయకులకు ఎప్పుడు పోతుం ది? పదుల సంఖ్యలో సంఘాలు ఉండి సాధించిందేమిటి? అవి ఎవరి కోసం పనిచేస్తున్నయి? పని చేయలేని, దుశ్చర్యలను ప్రశ్నించలేని చేవచచ్చిన సంఘాలు అవసరమా?’ అని నిలదీస్తున్నారు. ఇంకా ‘డబ్బులు తీసుకొని, ఆన్‌డ్యూటీ తీసుకొని, పదవుల పేరిట ప్రకటనలు, ఫొటోలు ఇచ్చుకునే సంఘ నాయకుల్లారా.. మీకు అస్తిత్వం ఉన్నదా..? మీ నాయకులు సస్పెండైతే ఎలా ఒక్కటయ్యారో అమాయకులైన ఉపాధ్యాయులు సస్పెండైతే బలంగా ఎందుకు స్పందించడం లేదు? మహిళా హక్కుల కోసం మాట్లాడే మహిళా మణుల్లారా.. ఇప్పుడెందుకు స్పందించడం లేదు?’ అంటూ మండిపడుతున్నారు. ‘నాయకుల్లారా ఇప్పటికైనా మీ గొంతు ఎత్తండి’ అంటూ సోషల్ మీడియా వేదికగా చేసిన విమర్శలు ప్రస్తుతం ఉపాధ్యాయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖతోపాటు సంఘా లు ఎలా స్పందిస్తాయో చూడాలి.
సభ్యత్వాలు, స్వప్రయోజనాలేనా..?
సస్పెన్షన్ల విషయంలో మెజార్టీ ఉపాధ్యాయులు సోషల్ మీడియా వేదికగా సంఘాల నాయకులను తూర్పార పడుతున్నారు. అందుకు అనేక ఉదాహరణలు కూడా చూపుతునారు. ఆ ప్రకారం చూస్తే.. ఇటీవల జరిగిన ఎస్సెస్సీ స్పాట్ సందర్భంగా పలు కారణాలతో ముగ్గురు ఉపాధ్యాయులను డీఈవో సస్పెండ్ చేశారు. అందులో ఇద్దరు సంఘ నాయకులు కూడా ఉన్నారు. దీంతో జిల్లాలోని అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఏకతాటిపైకి వచ్చి.. సదరు నాయకుల సస్పెన్షన్ ఎత్తివేయించడంతోపాటు యథాస్థానంలో పోస్టింగ్ ఇచ్చే వరకు పోరాటం చేశారు. సంఘాల పోరాటం, ఒత్తిళ్ల మేరకు.. అధికారులు తలొగ్గి సస్పెన్షన్ ఎత్తివేసి పోస్టింగ్ ఇచ్చారు. ఇదే విషయంలో మరో టీచర్ ఉండగా, ఆయన గురించి ఉపాధ్యాయ సంఘాలు పట్టించుకోలేదు. దీంతో నగునూర్‌లో పనిచేసే సదరు ఉపాధ్యాయుడిని ఏకంగా వీణవంకకు బదిలీ చేశారు. ఒకేసారి సస్పెండ్ అయిన ముగ్గురిలో ‘ఇద్దరు నాయకులకు ఒక నీతి.. సాధారణ ఉపాధ్యాయుడికి మరోనీతి’ అన్నట్టు సంఘాలు వ్యవహరించాయనే విమర్శలు అప్పుడే వచ్చాయి.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

