Jagityal | కళాకారుల సంక్షేమం, సంస్థ అభివృద్ధికి కృషి.. జగిత్యాల కళాకారుల ఐక్య వేదిక అధ్యక్షుడు బోగే అశోక్
జగిత్యాల జిల్లాలోని కళాకారుల సంక్షేమము, సంస్థ అభివృద్ధి కై నూతన పాలకవర్గం నిరంతరం కృషి చేస్తుందని సంఘం నూతన అధ్యక్షులు బోగే అశోక్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక బండారి గార్డెన్ లో జగిత్యాల కళాకారుల ఐక్య వేదిక (జేకేఐవీ) నూతన పాలకవర్గం సభ్యుల ప్రమాణ స్వీకారంను వ్యవస్థపాక కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
Jagityal | జగిత్యాల, నవంబర్ 27 : జగిత్యాల జిల్లాలోని కళాకారుల సంక్షేమము, సంస్థ అభివృద్ధి కై నూతన పాలకవర్గం నిరంతరం కృషి చేస్తుందని సంఘం నూతన అధ్యక్షులు బోగే అశోక్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక బండారి గార్డెన్ లో జగిత్యాల కళాకారుల ఐక్య వేదిక (జేకేఐవీ) నూతన పాలకవర్గం సభ్యుల ప్రమాణ స్వీకారంను వ్యవస్థపాక కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గ సభ్యులచే వ్యవస్థపాక కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయించి, పాలకవర్గం సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా అధ్యక్షులు అశోక్ తో పాటు వ్యవస్థపాక, పాలకవర్గం కమిటీ సభ్యులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఐక్యంగా జగిత్యాల జిల్లా కళాకారులూ నిలవడం అభినందనీయం అన్నారు. జగిత్యాల కళాకారుల ఐక్య వేదిక రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిందనడంలో ఎలాంటి అతిషయోక్తి లేదన్నారు. కళాకారుల ఐక్య వేదిక ద్వారా సహచర కళాకారులకు ప్రోత్సాహం అందించే దిశగా చర్యలు గైకొంటామని తెలిపారు. అందరు ఐక్యంగా ఉండి సంఘం పటిష్టత, నూతన కమిటీకి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు.
వ్యవస్థపాక కమిటీ, నూతన కమిటీ సమన్వయముతో జిల్లా కళాకారుల ఐక్య వేదిక బలోపేతం కు నిరంతరం కృషి చేస్తామన్నారు. నూతన పాలకవర్గం సభ్యుల సంక్షేమం కొరకు అనేక అంశాలను పరిగణలోకి తీసుకోని వాటి అమలు దిశగా ఐక్యంగా ముందుకు వెళ్తుందని అశోక్ తెలిపారు. తమ వల్ల వ్యవస్థపాక కమిటీ కి కానీ, సభ్యులకు గానీ ఇబ్బంది కలిగితే పెద్దమనసుతో క్షమించాలని కోరారు. భవిష్యత్ లో అందరి సమన్వయముతో ముందుకి సాగుతామని, ఫిర్యాదుల కోరకు ఒక సభ్యున్ని నియమించి సభ్యుల ఇబ్బందుల పరిష్కారంకు కమిటీ కృషి చేస్తుందన్నారు. అనంతరం నూతన కమిటీ సభ్యులను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ బాధ్యులు బొడ్డుపెల్లి లక్ష్మి నారాయణ, మెండు హరీష్ పటేల్,రాజారాం మోహన్ రెడ్డి, పెరంబదూర్ విజయలక్ష్మి, బొడ్డు సౌజన్య, క్రాంతి దగడ్, భూక్యా గంగాధర్ నాయక్, మల్యాల సతీష్, చిరంజీవి, గుండేటి సందీప్, శ్రీ చరణ్, శ్రీనివాస్, సంగెపు బాబు, గజ్జెల వందన, ఇప్పల లక్ష్మి, ఉమా తో పాటు వ్యవస్థపాక కమిటీ బాధ్యులు ఎస్వీ మల్లిక్ తేజ, ఇస్లావత్ కమల్ నాయక్, జె. డి సుమన్, పలిగిరి రాజేందర్, చుంచు మల్లేశం, అభి, ఓరుగంటి శేఖర్, గీత, మామిడి మౌనిక, సిరి, డైరెక్టర్ రాజ్ నరేంద్ర తో పాటు కళాకారులూ పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘విద్యార్థుల సమగ్ర వికాసంపై శ్రద్ధ చూపాలి’
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి : డీఏఓ వి.బాబురావు
Offbeat | బీచ్లో గర్ల్ఫ్రెండ్కు డైమండ్ రింగ్ చూపుతూ ప్రపోజ్.. అంతలోనే ఆ రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
బాల్య వివాహాల నిర్మూలనపై ఎంజీయూలో అవగాహన కార్యక్రమం
ట్రెండింగ్ వార్తలు
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్లో గర్ల్ఫ్రెండ్కు డైమండ్ రింగ్ చూపుతూ ప్రపోజ్.. అంతలోనే ఆ రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!

