Karimnagar | విద్యుత్ సంస్థలో అద్దె వాహన యజమానులు, డ్రైవర్ల సమ్మె
సమస్యలు పరిష్కరించాలని ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీ ఎన్పీడీసీఎల్) కరీంనగర్ సర్కిల్ పరిధిలోని విద్యుత్ కార్యాలయాల్లో అద్దెకు వాహనాలు నడిపిస్తున్న యజమానులు, డ్రైవర్లు ఆదివారం సమ్మెకు దిగారు.
- ఎస్ఈ కార్యాలయం ఆవరణలోనే నిలిచిన వాహనాలు
Karimnagar | ముకరంపుర, నవంబర్ 1 : సమస్యలు పరిష్కరించాలని ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీ ఎన్పీడీసీఎల్) కరీంనగర్ సర్కిల్ పరిధిలోని విద్యుత్ కార్యాలయాల్లో అద్దెకు వాహనాలు నడిపిస్తున్న యజమానులు, డ్రైవర్లు ఆదివారం సమ్మెకు దిగారు. టీజీ ఎన్పీడీసీఎల్ హైర్ వెహికిల్స్ ఓనర్స్, డ్రైవర్స్ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో వాహనాలన్నిటినీ ఎస్ఈ కార్యాలయానికి తరలించి నిలిపివేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ డీజిల్, పెట్రోల్ రేట్లు పెరగడం, వాహనాల మెయింటనెన్స్ భారం అధికంగా ఉన్న నేపథ్యంలో వాహనాలను నడిపేందుకు ఆర్ధికంగా ఇబ్బంది పడాల్సి వస్తుందని పేర్కొన్నారు.
ఈ విషయంపై ఇప్పటికే పలు మార్లు సంస్థ ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందజేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న అద్దె రేట్లను పరిశీలించి, పెరిగిన డీజిల్, పెట్రోల్, ఇన్సూరెన్స్, మెయింటనెన్స్ ధరలకు అనుగుణంగా అద్దె రేట్లు పెంచాలని డిమాండ్ చేశారు. కారుకు నెలకు 2 వేల కిలోమీటర్లకు రూ.55 వేలు, బొలెరో వాహనానికి 2 వేల కిలోమీటర్లకు రూ.65 వేలు చెల్లించాలని కోరారు. ఒక వేళ అదనంగా తిరిగితే కారుకు కిలోమీటర్ కు రూ.15, బొలెరో కు రూ.20 చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు గట్టు పవన్, మొలుగూరి గణేష్, నాయకులు కల్లెపెల్లి కుమార్, ప్రభాకర్, శ్రీనివాస్, రాము, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | రైతు కుటుంబాలకు అండగా ఉంటాం.. మరో ఏడాది ధైర్యంగా ఉండండి.. బోథ్‌లో కేటీఆర్
Polio | పోలియో అసలు ఎలా వస్తుంది.. రెండు రకాల టీకాలను ఎందుకు వేయించాలి..?
Laxma Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్లే రైతాంగానికి తీరని నష్టం : మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
Manchu Manoj | రాప్తాడు ఘటనపై మంచు మనోజ్ రియాక్షన్.. మహిళల గౌరవం ఇంటి నుంచే మొదలవ్వాలంటూ పిలుపు!
Vande Bharat Sleeper Train | పట్టాలెక్కిన బెంగళూరు-ముంబై వందే భారత్ స్లీపర్ రైలు.. ప్రారంభించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

