Minister Laxman Kumar | అవార్డు గ్రహీత బొల్లి స్వామిని అభినందించిన రాష్ట్ర మంత్రి లక్ష్మణ్ కుమార్
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రానికి చెందిన అంబేద్కర్ సంఘ నాయకుడు బొల్లి స్వామి ఇటీవల అంబేద్కర్ మహాత్మ జ్యోతిబాపూలే జాతీయ స్థాయి అవార్డును పొందగా ఆయనను రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అభినందించారు.
Minister Laxman Kumar | ధర్మారం, నవంబర్ 30: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రానికి చెందిన అంబేద్కర్ సంఘ నాయకుడు బొల్లి స్వామి ఇటీవల అంబేద్కర్ మహాత్మ జ్యోతిబాపూలే జాతీయ స్థాయి అవార్డును పొందగా ఆయనను రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అభినందించారు. స్వామి గత 40 సంవత్సరాల నుంచి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో స్వామిని జాతీయ ఫౌండేషన్ అంబేద్కర్ ఫూలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి పివి రత్నం జాతీయ పురస్కారం కోసం ఎంపిక చేశారు.
ఈ క్రమంలో స్వామి చేసిన సేవలను గుర్తించి ఈనెల 26న జరిగిన రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా న్యూఢిల్లీలోని అంబేడ్కర్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో స్వామికి అంబేద్కర్ పూలే అవార్డును అందజేశారు. స్వామి మహాత్మ జ్యోతిబాపూలే పురస్కారాన్ని అందుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఆదివారం ధర్మారం మండల కేంద్రంలో అవార్డు గ్రహీత స్వామిని లక్ష్మణ్ కుమార్ అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రూప్ల నాయక్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీపీ కొడారి హన్మయ్య ,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సోగాల తిరుపతి, పట్టణ అధ్యక్షుడు కరేటి వేణు, ఏఎంసీ మాజీ చైర్మన్ కొత్త నరసింహం, మాజీ వైస్ చైర్మన్ పాలకుర్తి రాజేశం, ఏఎంసి డైరెక్టర్ జనగామ తిరుపతి, పార్టీ నాయకులు దేవి జనార్ధన్, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
Raipur man jailed in Russia | ఉద్యోగం కోసం రష్యా వెళ్లిన వ్యక్తి.. డ్రగ్స్ కేసులో అరెస్ట్, ఆర్మీలో చేరాలని ఒత్తిడి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

