రాములోరి దర్శనానికి స్పెషల్ రైళ్లు
అయోధ్య శ్రీ రామమందిరం ప్రారంభం, విగ్రహ ప్రాణప్రతిష్ట మహోత్సవం ఈ నెల 22న జరుగనుండగా, రైల్వే శాఖ మన రాష్ట్రం నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నది.
- ఈ నెల 29 నుంచి మార్చి 3 దాకా సేవలు
అయోధ్య శ్రీ రామమందిరం ప్రారంభం, విగ్రహ ప్రాణప్రతిష్ట మహోత్సవం ఈ నెల 22న జరుగనుండగా, రైల్వే శాఖ మన రాష్ట్రం నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నది. ఈ నెల 29 నుంచి వచ్చే మార్చి 3వ తేదీ వరకు అయోధ్య ధాం రైల్వే జంక్షన్‌కు సికింద్రాబాద్, ఖాజీపేట, జాల్నా నుంచి ఆస్థా స్పెషల్ సర్వీసులు నడపాలని నిర్ణయించి, వాటి వివరాలు వెల్లడించింది. – పెద్దపల్లి, జనవరి 21 (నమస్తే తెలంగాణ)
జాల్నా నుంచి..
జాల్నా నుంచి అయోధ్య ధాం జంక్షన్‌కు (వయా పర్భని- పూర్ణా- నాందేడ్- నిజామాబాద్- కరీంనగర్- పెద్దపల్లి- బల్లార్షా మీదుగా) రైలు నంబర్ (07649) ఫిబ్రవరి 4న నడుస్తుంది. ఉదయం 9:30 గంటలకు జాల్నా రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి బాసరకు మధ్యాహ్నం 3:15 గంటలకు, నిజామాబాద్‌కు సాయంత్రం 4కు, కోరుట్లకు 5:18కు, లింగంపేట్ జగిత్యాలకు 5:50కు, కరీంనగర్ రైల్వేస్టేషన్‌కి 6:45కు, పెద్దపల్లి జంక్షన్‌కి 7:35కు, రామగుండానికి 8గంటలకు చేరుకొని 6న ఉదయం 3:35 గంటలకు అయోధ్య చేరుకోనున్నది.
ఇక అయోధ్య ధాం జంక్షన్ నుంచి జాల్నా వరకు రైలు నంబర్ (07650) ఫిబ్రవరి 6న నడుస్తుంది. అక్కడ మధ్యాహ్నం 2:20 గంటలకు బయలు దేరి మరుసటి రోజు శుక్రవారం ఉదయం 6 గంటలకు జాల్నా రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. మార్గమధ్యంలో రామగుండానికి సాయంత్రం 7:25 గంటలకు, పెద్దపల్లి జంక్షన్‌కి 7:55కు, కరీంనగర్ రైల్వే స్టేషన్‌కి రాత్రి 8:35కు, లింగంపేట్ జగిత్యాల రైల్వే స్టేషన్‌కు రాత్రి 9:20కు, కోరుట్లకు రాత్రి 9:50కు, నిజామాబాద్ జంక్షన్‌కి రాత్రి 11:10కు, బాసర రైల్వే స్టేషన్‌కు 11:53 గంటలకు చేరుకుంటుంది. మరుసటి రోజు 6 గంటలకు జాల్నా రైల్వే స్టేషన్‌కి చేరుకుంటుంది. ఈ రైళ్లలో 20 స్లీపర్ కోచ్ బోగీలు, 2 సాధారణ బోగీలు ఉండనున్నాయి.
సికింద్రాబాద్ జంక్షన్ పరిధిలో..
సికింద్రాబాద్ జంక్షన్ నుంచి అయోధ్య ధాం జంక్షన్‌కు రైలు నంబర్ (07221)ను నడుపనున్నారు. ఇది ఈ నెల 29వ నుంచి ఫిబ్రవరి 29వ తేదీ మధ్య వారంలో మూడు రోజుల (మొత్తం 16ట్రిప్‌లు)పాటు నడుస్తుంది. ఇది జనవరి 29, 31, ఫిబ్రవరి 2, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29 తేదీల్లో సాయంత్రం 4:45 గంటలకు సికింద్రాబాద్ జంక్షన్ నుంచి బయలుదేరుతుంది.
మార్గమధ్యంలో కాజీపేట జంక్షన్‌కి సాయంత్రం 6:20 గంటలకు, పెద్దపల్లి జంక్షన్‌కి రాత్రి 7:38కు, రామగుండానికి రాత్రి 8 గంటలకు వచ్చి, రెండ్రోజుల ప్రయాణం తర్వాత ఉదయం 3:30 గంటలకు అయోధ్యకు చేరుకుంటుంది. తిరిగి అయోధ్య నుంచి సికింద్రాబాద్ జంక్షన్ వరకు రైలు (07222) ఫిబ్రవరి 1, 3, 5, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, మార్చి 1, 3 తేదీల్లో నడుస్తుంది. ఇది అయోధ్య నుంచి మధ్యాహ్నం 2:20 గంటలకు బయలు దేరి, మరుసటి రోజు రాత్రి 10:30 గంటలకు సికింద్రాబాద్ జంక్షన్ చేరుకుంటుంది. మార్గమధ్యంలో రామగుండానికి సాయంత్రం 06:30, పెద్దపల్లి జంక్షన్‌కి 7కు, కాజీపేట జంక్షన్‌కి 8:08 గంటలకు చేరుకుంటుంది.
కాజీపేట జంక్షన్ పరిధిలో..
కాజీపేట నుంచి అయోధ్య ధాం జంక్షన్ రైల్వే స్టేషన్‌కు రైలు నంబర్ (07223) ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు వారంలో మూడు రోజులు (మొత్తం 15ట్రిప్‌లు) నడుస్తాయి. జనవరి 30, ఫిబ్రవరి 1, 3, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28 తేదీల్లో ఖాజీపేట జంక్షన్ నుంచి సాయంత్రం 06:20 గంటలకు బయలుదేరుతుంది. పెద్దపల్లి జంక్షన్‌కు రాత్రి 7:38కు, రామగుండానికి 8 గంటలకు చేరుకుంటుంది.
రెండ్రోజుల ప్రయాణం తర్వాత ఉదయం 3:35 గంటలకు అయోధ్య జంక్షన్ చేరుకుంటుంది. ఇక అయోధ్య జంక్షన్ నుంచి కాజీపేట జంక్షన్‌కు రైలు నంబర్ (07224) ఫిబ్రవరి 2, 4, 6, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29 తేదీల్లో, మార్చి 2న (మొత్తం15 ట్రిప్‌లు) నడుస్తాయి. ఇది అయోధ్య నుంచి మధ్యాహ్నం 2:20 గంటలకు బయలు దేరి మరుసటి రోజు రాత్రి 9 గంటలకు కాజీపేట జంక్షన్ చేరుకుంటుంది.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

