Jagityala SP | జగిత్యాల, జులై 8 : మేడిపల్లి మండల కేంద్రానికి చెందిన సురకంటి భూమా రెడ్డి, లక్ష్మీ అనే వృద్ధ తల్లిదండ్రులను కొడుకు లింగారెడ్డి, కోడలు పుష్పలత, మనుమడు రంజిత్ చంపుతామని బెదిరింపులకు గురిచేస్తున్నారని మంగళవారం జిల్లా ఎస్పీకి, సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జిల్లా సంఘానికి ఫిర్యాదు చేశారు.
ఆ వినతిపత్రాల్లో తమ పేరు మీదున్న భూములను వారి పేరు మీద మార్చాలని, రైతు బంధు డబ్బులు వారికే ఇవ్వాలని తరచుగా కొట్టుతూ, చంపుతామని బెదిరింపులు చేస్తున్నందున తగు చర్యలు తీసుకోవాలని కోరారు. వీరి ఫిర్యాదు మేరకు కోరుట్ల ఆర్డీవో కార్యాలయంలో వృద్ధుల సంరక్షణ కింద కేసు దాఖలు చేశామని, వేధింపులు మానక పోతే మూడు మాసాల జైలు శిక్షతో పాటు జరిమానకు చట్ట ప్రకారం గురువుతారని సీనియర్ సిటీజెన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్, కౌన్సెలింగ్ అధికారి పీసీ హన్మంత రెడ్డి పేర్కొన్నారు.