Godavarikhani | కోల్ సిటీ, ఫిబ్రవరి 14: ఈ నెలలో హైదరాబాద్ లో జరగబోయే రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు పెద్దపల్లి జిల్లా జట్టును ఎంపిక చేశారు. గోదావరిఖని జేఎల్ఎన్ స్టేడియంలోని వ్యాయామ శాలలో జరిగిన ఎంపిక పోటీలకు 20 మంది పవర్ లిఫ్టింగ్, 25 మంది మహిళలు, పురుషుల కేటగిరిలో పాల్గొన్నారు. కేటగిరికి ఒకరి చొప్పున ప్రథమ స్థానంలో నిలిచిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు.
కాగా, ఈ ఎంపిక పోటీలు వెయిట్ లిఫ్టింగ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గాండ్ల రాజా, శారద, పవర్ లిఫ్టింగ్ అధ్యక్ష, కార్యదర్శులు నాగరాజు, గాండ్ల శ్రీనివాస్ పర్యవేక్షణలో నిర్వహించారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన వ్యాయామ క్రీడాకారులను అసోసియేషన్ ప్రతినిధులు అభినందించి మెడల్స్ బహుకరించారు.