IG Chandrasekhar Reddy | రాజన్న భక్తులకు పటిష్టవంతమైన భద్రత : ఐజీ చంద్రశేఖర్ రెడ్డి
IG Chandrasekhar Reddy | దేశ నలుమూలల నుంచి వచ్చే రాజన్న భక్తులకు పటిష్టవంతమైన భద్రత కల్పించేందుకు సమగ్ర చర్యలు చేపడుతున్నామని మల్టీ జోన్ -1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.
వేములవాడ : దేశ నలుమూలల నుంచి వచ్చే రాజన్న భక్తులకు పటిష్టవంతమైన భద్రత కల్పించేందుకు సమగ్ర చర్యలు చేపడుతున్నామని మల్టీ జోన్ -1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి (IG Chandrasekhar Reddy ) అన్నారు. ఆదివారం వేములవాడ ( Vemulawada ) లోని భీమేశ్వర స్వామి ఆలయం సందర్శనం సందర్భంగా ఆయనకు ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

అనంతరం స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆశీర్వచన మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలను ఈవో రమాదేవి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ అధికారులతో మాట్లాడుతూ దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడకు దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తారని, స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమగ్ర భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు.
భక్తుల రాకపోకలు సాఫీగా సాగేందుకు ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఆలయ పరిసర ప్రాంతాల్లో గస్తీ పెంచాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచుతూ, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య, ఆలయ ఈవో రమాదేవి, వేములవాడ, సిరిసిల్ల, డీఎస్పీలు శ్రీనివాసులు, నాగేంద్రచారి, సిఐలు వీరప్రసాద్, శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

