Science Projects | సమాజానికి మేలు చేసే సైన్స్ ప్రాజెక్టులను రూపొందించాలి : కలెక్టర్ పమేలా సత్పతి
Science Projects | విద్యార్థులు ప్రకృతితో మమేకమవుతూ సమాజానికి మేలు చేసే ఆవిష్కరణలు, ప్రాజెక్టులు రూపొందించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.
కరీంనగర్ కమాన్ చౌరస్తా : విద్యార్థులు ప్రకృతితో మమేకమవుతూ సమాజానికి మేలు చేసే ఆవిష్కరణలు, ప్రాజెక్టులు ( Science projects) రూపొందించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ( Collector Pamela Satpati ) అన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శనివార స్ధానిక కొత్తపల్లిలోని అల్ఫోర్స్ఈ టెక్నో పాఠశాలలో 2025-26 సంవత్సర జిల్లాస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన, ఇన్స్పైర్ అవార్డ్స్మనాక్ను కలెక్టర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత పది సంవత్సరాలుగా క్రమం తప్పకుండా జిల్లా నుంచి సైన్స్ఎగ్జిబిట్లు రాష్ట్ర, జాతీయస్థాయికి ఎంపికవడం గర్వకారణమన్నారు. ఏ జిల్లాలో లేని విధంగా కరీంనగర్లో సైన్స్ మ్యూజియం ఉన్నదని, ప్రభుత్వ, ప్రైవేట్ పిల్లలు ఎవరైనా మ్యూజియం సందర్శించవచ్చని పేర్కొన్నారు.
ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా విద్యార్థులు బాలశాస్త్రవేత్తలుగా ఎదగడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని వివరించారు. మన దేశం కోసం, మన ప్రజల కోసం ఏం మంచి చేయగలుగుతామో ఆ దిశగా ఆలోచించడమే ఆత్మనిర్భర్ భారత్, వికసిత భారత్(Vikasit Bharat ) లక్ష్యమన్నారు.
జిల్లా విద్యాశాఖాధికారి శ్రీరామ్ మొండయ్య మాట్లాడుతూ విద్యార్థులు ప్రతి అంశాన్ని శాస్త్రీయ దృక్పథంతో పరిశీలించాలని, ఆలోచనలో, ప్రవర్తనలో వైజ్ఞానికత ఉండాలన్నారు. అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి , జిల్లా సైన్స్ అధికారి జైపాల్ రెడ్డి , జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు కార్యదర్శి ఎస్ భగవంతయ్య, సెక్టోరియల్ అధికారులు కర్ర అశోక్ రెడ్డి, ఆంజనేయులు, మిల్కూరి శ్రీనివాస్, కృపారాణి, కొత్తపల్లి మండల విద్యాశాఖాధికారి ఆనందం, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్ఫోర్స్, బాల భవన్ విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

