Sarangapur | సారంగాపూర్, ఫిబ్రవరి 2: సారంగాపూర్ మండలంలోని అతిపెద్ద గ్రామమైన రేచపల్లిలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ బ్రాంచ్ ను ఏర్పాటు చేయాలని కోరుతు సోమవారం గ్రామ సర్పంచ్ బాస మహేష్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ జిల్లా రీజనల్ మేనేజర్ కు వినతి పత్రం అందజేశారు.
సారంగాపూర్ మండలంలోని ఉమ్మడి రేచపల్లి గ్రామంలో సుమారు 10వేల వరకు జనాభ ఉంటుందని మండల కేంద్రంలోని గ్రామీణ బ్యాంకులో ఎక్కువగా 5 నుండి 7వేల వరకు బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, 5వేల ఎకరాలకు పైగా వ్యవసాయ పట్టా భూములు ఉన్నాయని. గ్రామంలో 105 డ్వాక్రా స్వశక్తి సంఘాలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. మండలంలోనే పెద్ద గ్రామమైనప్పటికి ఒక్క బ్యాంక్ బ్రాంచ్ కూడా లేదని దీంతో రైతులు, మహిళలు, విద్యార్థులు బ్యాంకుకు మండల కేంద్రానికి వెళ్లేందు ఇబ్బందులు పడుతున్నారని గ్రామంలో గ్రామీణ బ్యాంక్ బ్రాంచ్ ను ఏర్పాటు చేయాలని రీజనల్ మేనేజర్ ను కోరారు.