Sanitation | వెన్నంపల్లిలో పారిశుధ్యం అస్తవ్యస్తం.. మురుగునీటితో దోమల వ్యాప్తి, ఇబ్బందుల్లో గ్రామస్తులు
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని వెన్నంపల్లి గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఇదంతా చూస్తున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో గ్రామం అపరిశుభ్రమయంగా మారిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- తాగునీటి పైప్లైన్ లీకేజీ.. కలుషిత నీటి సరఫరాతో అనారోగ్యం
- అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం
Sanitation | కాల్వ శ్రీరాంపూర్, అక్టోబర్ 14 : కాల్వశ్రీరాంపూర్ మండలంలోని వెన్నంపల్లి గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఇదంతా చూస్తున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో గ్రామం అపరిశుభ్రమయంగా మారిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని మురికి కాలువలను సరిగా లేక డ్రైనేజీ నీరు ఇళ్ల ముందే నిలిచిపోయి తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. నిలిచిన మురికి నీటితో దోమలు విపరీతంగా పెరిగిపోయి రాత్రి వేళల్లో నిద్ర కరువై రోగాల బారిన పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. మరొకవైపు పాత గ్రామపంచాయతీ సమీపంలో ప్రధాన తాగునీటి పైప్లైన్ లీకేజీ అయి నీరు రోడ్డుపైకి ప్రవహిస్తోంది. దీనివల్ల పైప్లైన్లోకి మురిగునీరు చేరి కలుషిత నీరు సరఫరా అవుతోందని, ఆ నీటిని తాగి పలువురు గ్రామస్తులు అస్వస్థతకు గురవుతున్నారని తెలిపారు.
మండలానికి ప్రత్యేక అధికారి (స్పెషల్ ఆఫీసర్)గా జిల్లా సహకార సంఘం అధికారి శ్రీమాల బాధ్యతల్లో ఉన్నప్పటికీ, గ్రామంలోని ప్రజా సమస్యలను పట్టించుకోవడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి మురికి కాలువలను శుభ్రం చేయించాలని, లీకేజీ అయిన తాగునీటి పైప్లైన్కు వెంటనే మరమ్మతులు చేపట్టి మంచినీటిని అందించాలని వెన్నంపల్లి గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

