Road Accident | హైదరాబాద్ : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి ఆరుగురు హైదరాబాద్ ఓఆర్ఆర్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. మరోకరు చావు బతుకుల మధ్య కొట్టుమిట్లాడుతున్నారు. సిరిసిల్లకు చెందిన బీఆర్ఎస్ నేత బొల్లి రాంమోహన్ సొదరుడు బొల్లి రాజు కుటుంబ సభ్యులు ఈ ప్రమాదంలో మృతి చెందినట్లు తెలిసింది. ఈ రోడ్డు ప్రమాదం విషయం సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారీకి తెలియడంతో బొల్లి రాంమోహన్ కుటుంబ సభ్యులకు సమాచారమందజేశారు. విషయం తెలియడంతో బొల్లి రాంమోహన్ బోరున విలపించారు. కుటుంబ సభ్యులు హైదరాబాద్ తరలివెళ్లారు.
కేటీఆర్ దిగ్ర్భాంతి
రోడ్డు ప్రమాదంలో సిరిసిల్ల బీఆర్ఎస్ నేత రాంమోహన్ సొదరుడి కుటుంబ సభ్యులు మృతి చెందిన విషయం తెలియగానే సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఫోన్ చేసి మాట్లాడారు. శంషాబాద్ ఏసీపీ నాగభూషణాన్ని వివరాలు అడిగి తెలిసుకున్నారు. కేటీఆర్ పీఏ మహేందర్ రెడ్డి సంఘటన స్థలానికి వెళ్లారు. సిరిసిల్ల వాసులు మృతి పట్ల కేటీఆర్ దిగ్బాంతిని వ్యక్తం చేశారు.