Odela | ఓదెల, జూన్ 20: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ సంజనేషుని పెద్దపల్లికి డిప్యూటేషన్ పై పంపించడాన్ని రద్దు చేయాలని కోరుతూ కొలనురు గ్రామపంచాయతీ పాలకవర్గంతో పాటు పరిసర గ్రామాల సర్పంచులు డిమాండ్ చేశారు. ఈ మేరకుఎమ్మెల్యే, విప్ విజయ రమణారావు ను శనివారం కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.
డాక్టర్ సంజనేష్ పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించే విషయంలో ప్రజల మన్నలను పొందుతున్నట్లు వారు తెలిపారు. గ్రామస్తులందరూ సంజనేష్ డాక్టర్ కావాలని కోరుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేను కలిసి విన్నవించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొలనూర్, హరిపురం, గోపరపల్లి సర్పంచులు పల్లె కనకయ్య, గారవేణి విజయ౼ నాగరాజు యాదవ్, మద్దేవేని రవి యాదవ్, ఉపసర్పంచ్ పాకాల సంపత్ రెడ్డి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.