IND vs AFG : తొలి రెండు వన్డేల్లో తేలిపోయిన అఫ్గనిస్థాన్ బ్యాటర్లు మూడో మ్యాచ్‌లోనూ తడబడ్డారు. ఆరంభంలోనే టాపార్డర్‌ను ప్రసిధ్ కృష్ణ(5-23) పెవిలియన్ చేర్చి కాబూలీ టీమ్‌ను హడలెత్తించాడు. ప్రధాన ఆటగాళ్లు విఫలమైనా హష్మతుల్లా షాహిదీ(102 ) ఒంటరి పోరాటంతో జట్టను ఆదుకున్నాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్(50)తో కలిసి దంచేసిన షాహిదీ వన్డేల్లో తొలి శతకంతో రెచ్చిపోయాడు. అతడి కృషితో అఫ్గన్ జట్టు భారత్‌కు సవాల్ విసరే స్కోర్ చేయగలిగింది.
నామమాత్రమైన మూడో వన్డేలోనూ భారత బౌలర్లు చెలరేగారు. చెపాక్ స్టేడియంలో ప్రసిధ్ కృష్ణ(5-23) అఫ్గనిస్థాన్.. టాపార్డర్‌ను పడగొట్టాడు. రహ్మనుల్లా గుర్బాజ్(5), ఇబ్రహీం జద్రాన్(11), రహ్మత్ షా(5)లను ప్రసిధ్ వెనక్కి పంపగా.. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన హష్మతుల్లా షాహిది(102) క్రీజునంటుకుపోయాడు. భారత బౌలర్లను కాచుకొని అర్ధ శతకంతో రాణించాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్(50)తో కీలక భాగస్వామ్యం నెలకొల్పి స్కోర్ దాటించాడు.
Maiden ODI hundred. A special one for Hashmatullah Shahidi 💯 pic.twitter.com/LFLhWa6iEH
— ESPNcricinfo (@ESPNcricinfo) June 20, 2026
షాహిదీతో కలిసి స్కోర్ బోర్డును నడిపిస్తున్న అజ్మతుల్లాను ప్రిన్స్ యాదవ్() ఔట్ చేయడంతో.. మొహమ్మద్ నబీ(21) కాసేపు పోరాడాడు. కానీ, అతడిని గుర్నూర్ బ్రార్ బౌల్డ్ చేసి ఆరో వికెట్ అందించాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా షాహిదీ మాత్రం జోరు తగ్గించలేదు. వాషింగ్టన్ సుందర్ వేసిన 44వ ఓవర్లో బౌండరీతో ఈ కుర్రాడు తొలి శతకం అందుకున్నాడు. సెంచరీ బాదిన షాహిదీని ఔట్ చేసిన ప్రసిధ్ ఐదో వికెట్ ఖాతాలో వేసుకోగా.. 45వ ఓవర్లోనే అఫ్గనిస్థాన్ 218 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో బ్రార్, హర్ష్ దూబే చెరొక వికెట్ తీశారు.
Three wickets for Prasidh Krishna, three catches for Rohit Sharma: Afghanistan’s top three with the same dismissal on the scorecard 😮 #INDvAFG pic.twitter.com/GT6Lmsn0jk
— ESPNcricinfo (@ESPNcricinfo) June 20, 2026