వడ్లు కొనదు.. విత్తనాలియ్యదు
యాసంగిలో పండిన వడ్లను పూర్తిస్థాయిలో కొనకుండా.. వానకాలం సీజన్లో విత్తనాలు ఇవ్వకుండా కాంగ్రెస్ సరారు రైతులపై కుట్ర చేస్తున్నదని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు.
- రైతులపై కాంగ్రెస్ సర్కారు కుట్ర
- మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజం
తిమ్మాపూర్, జూన్ 12 : యాసంగిలో పండిన వడ్లను పూర్తిస్థాయిలో కొనకుండా.. వానకాలం సీజన్లో విత్తనాలు ఇవ్వకుండా కాంగ్రెస్ సర్కారు రైతులపై కుట్ర చేస్తున్నదని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు. మరో సీజన్లో వరి వేయాలంటే భయపడేలా చేస్తున్నదని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో రైతులకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకున్నారని, సాగు పండుగలా సాగిందని గుర్తు చేశారు. ఈ నెల 16న బీఆర్ఎస్ మానకొండూర్ నియోజకవర్గ విసృ్తత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నామని మాజీ మంత్రి హరీశ్‌రావు, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి హాజరవుతారని చెప్పారు. కార్యకరలు నాయకులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. తిమ్మాపూర్‌లోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో విపతర పరిస్థితి కొనసాగుతున్నదని, నారు పోయాల్సిన రైతులు.. ఇంకా యాసంగి వడ్లనే పట్టుకొని ఉండాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. ముఖ్యంగా మానకొండూర్ నియోజకవర్గంలో పరిస్థితి అధ్వానంగా తయారైందని విమర్శించారు. మృగశిర వచ్చినా విత్తనాలు, ఎరువులు అందుబాటులో లేవని ఆరోపించారు. ‘రైతు భరోసా లేదు, పంట కొనే దికు లేదు, కరెంటు లేదు, రైతుకు ఏం చేస్తున్నరు’ అని ప్రశ్నించారు. యూరియా యాప్‌లో లేదని.. షాప్‌లో లేదని అన్నారు. ఈ సారి కూడా యూరియా కష్టాలు తప్పేలా లేవన్నారు. పుట్టినరోజు వేడుకలను అత్యంత ఘనంగా జరుపుకున్న ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణకు ప్రజల సమస్యలు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.
వేడుకల కోసం హుకుం జారీ చేసిన ఆయన.. రైతుల సమస్యలపై ఎందుకు జారీ చేయలేదని, పంట కొనుగోలు విషయంలో ఎందుకు స్పందించలేదని నిలదీశారు. మానేరు పరిసరాల్లో ఇసుకడంపులు కనిపించడం లేదా? అని అడిగారు. అక్రమ సంపాదనకు ఎగబడ్డారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రజలకు సేవ చేయాలని హితవుపలికారు. సమావేశంలో పార్టీ మండలాధ్యక్షుడు రావుల రమేశ్, రాష్ట్ర నాయకుడు కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, నాయకులు శేఖర్‌గౌడ్, ఉల్లెంగుల ఏకానందం, రవీందర్‌రెడ్డి, గంప వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

