BRS | బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య హౌస్ అరెస్ట్
BRS | సీఎం రేవంత్రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులను ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు.
BRS | సీఎం రేవంత్రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులను ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. కాగా, సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో పాటు అన్ని మండలాలు, గ్రామాల్లోని ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు, సర్పంచులు, మాజీ ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ యూత్ , మాజీ సర్పంచ్లను సైతం తెల్లవారుజామునే అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్ లో బీఆర్ఎస్ నేతలు, సర్పంచులు వినూత్న నిరసన తెలిపారు. పోలీస్ స్టేషన్లోనే పండ్లు తోముకుంటూ సీఎం రేవంత్ రెడ్డి తీరుకు, అక్రమ అరెస్టు నిరసన గా ఆందోళన చేశారు.
6 గ్యారంటీలు, 420 హామీలు నెరవేర్చకుండా, ప్రజలను మోసం చేస్తూ సిరిసిల్లలో కేటీఆర్ పై కక్షతో సభ పెట్టారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి హోదాలో వస్తున్న రేవంత్ రెడ్డి,ఇచ్చిన హామీలు సిరిసిల్ల సభలో అమలు చేస్తున్నట్టు ప్రకటించాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల జిల్లాలోని సమస్యలను, సిరిసిల్ల అభివృద్ధికి మూడేళ్లలో ఏం చేశారని ప్రశ్నించారు. 8000 ఎకరాలు కబ్జాకు గురయ్యాయని, 2400 ఎకరాల భూమిని రికవరీ చేశామని అసెంబ్లీలో చెప్పిన రేవంత్ రెడ్డి సిరిసిల్ల సభలో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సిరిసిల్లలో కేటీఆర్ చేసిన అభివృద్ధిని చూసి బుద్ధి తెచ్చుకొని కనీసం మీ కొడంగల్ లోనైనా అభివృద్ధి చేసుకోవాలని హితువు పలికారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

