Ragging | జగిత్యాల నర్సింగ్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం.. విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల హాస్టల్లో థర్డ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిని గురువారం సాయంత్రం మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన తోటి విద్యార్థినులు ఆమెను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
- తోటి స్టూడెంట్స్, అధ్యాపకుల వేధింపులే కారణమని బాధితురాలి ఆరోపణ.
Ragging | జగిత్యాల కలెక్టరేట్ : జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల హాస్టల్లో థర్డ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిని గురువారం సాయంత్రం మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన తోటి విద్యార్థినులు ఆమెను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా ఆమెకు ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బాధితురాలు మాట్లాడుతూ తోటి విద్యార్థులు, అధ్యాపకుల వేధింపులే తన ఆత్మహత్యాయత్నానికి కారణమని ఆరోపించింది. తోటి విద్యార్థులు ర్యాగింగ్ తరహాలో వేధిస్తున్నారంటూ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ఫిర్యాదు తర్వాత వేధింపులు మరింత పెరిగాయని ఆవేదన వ్యక్తం చేసింది. అసభ్య పదజాలంతో దూషిస్తూ మానసికంగా వేధించారని, పిచ్చి పట్టిందంటూ ఎగతాళి చేశారని తెలిపింది. ఘటన బయటకు రాకుండా ఆస్పత్రికి తరలించేలా యాజమాన్యం ఒత్తిడి చేసిందని ఆరోపించింది. తోటి విద్యార్థుల ర్యాగింగ్ ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందని ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై వివరణ కోరేందుకు ప్రిన్సిపల్‌ను సంప్రదించగా ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉంది.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allu Arjun | సినిమాల విషయంలో రూటు మార్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇకపై వరుస సినిమాలతో బిజీ బిజీ!
India-US trade deal | భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం.. కీలక అంశాలు..!
Terrorist Arrested | ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాది అరెస్ట్.. ఏకే-47 స్వాధీనం
ఇందిరమ్మ బీమా నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి : కలెక్టర్ అంకిత్
Abhijeet Dipke | ‘నేను ఇక్కడే ఉన్నా, నన్ను అరెస్ట్ చేయండి’.. లుకౌట్ నోటీస్‌పై అభిజిత్ దిప్కే
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

