సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో పోలీసు క్రీడా సంబురాలు శుక్రవారం అట్టహాసంగా మొదలయ్యాయి. రెండురోజులపాటు జరగనున్న ఈ పోటీలను ఎస్పీ అఖిల్ మహాజన్ జ్యోతిప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. అంతకుముందు స్పోర్ట్స్ పతాకాన్ని ఆవిష్కరించి వందన సమర్పణ చేశారు.
శాంతికపోతాలు, బెలూన్లను గాల్లోకి ఎగుర వేశారు. అనంతరం కాగడను పోలీసు సిబ్బందికి అందజేశారు. క్రీడాకారులు గ్రౌండ్లో ఫ్లాగ్‌మార్చ్ చేసి ఆకట్టుకున్నారు. ఆరంభ వేడుకల్లో విద్యార్థినులు ఆటపాటలతో హోరెత్తించారు.
– తెలంగాణ చౌక్, ఏప్రిల్ 28