Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
Ambarkishore jha | ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడైనా సీపీ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని, ఆపదలో ఉన్న వారికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా భరోసా ఇచ్చారు.
Ambarkishore jha | ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించి, బాధితులకు తక్షణ భరోసా కల్పించడమే పోలీస్ శాఖ లక్ష్యమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. సోమవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన “ప్రజావాణి” కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించి,వారి సమస్యలను ఓపికగా అడిగి తెలుసుకున్నారు.
ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడైనా సీపీ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని, ఆపదలో ఉన్న వారికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ప్రజావాణి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి పలు ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదులపై వెంటనే స్పందించిన పోలీస్ కమిషనర్, సంబంధిత స్టేషన్ హౌస్ అధికారులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు.
చట్ట పరిధిలోని ప్రతి ఫిర్యాదుపై ఎలాంటి జాప్యం లేకుండా, పారదర్శకంగా విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులకు సంబంధించిన ఫిర్యాదులపై అత్యంత సున్నితంగా, మానవీయ దృక్పథంతో వ్యవహరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (పరిపాలన) కె.శ్రీనివాస్ పాల్గొన్నారు.
Read Also :
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
Chandrababu | బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకుంటే మంచిది.. వైసీపీకి చంద్రబాబు హెచ్చరిక
విశ్వామిత్ర చౌహాన్ సేవలు అభినందనీయం : అదనపు కలెక్టర్ వేణుగోపాల్
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
Singapore haze | సింగపూర్‌లో 15 రోజులుగా దట్టమైన పొగమంచు.. అనారోగ్యకర స్థాయిలో గాలి నాణ్యత..!
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

