రైస్ మిల్లులో సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు
పెద్దపల్లి జిల్లా మంథని మండలం సూరయ్యపల్లి గ్రామంలోని రైస్ మిల్లులో సివిల్ సప్లయి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. తెలంగాణ సివిల్ సప్లై కమిషన్ ఆదేశాల మేరకు సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఎఫ్‌సీఐ అధికారులు మంథని మండలం సూరయ్యపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మి మోడ్రన్ పారాబాయిల్డ్ రైస్ అండ్ మిల్లులో ఏక కాలంలో తనిఖీలు నిర్వహించారు.
మంథని, మార్చి 28: పెద్దపల్లి జిల్లా మంథని మండలం సూరయ్యపల్లి గ్రామంలోని రైస్ మిల్లులో సివిల్ సప్లయి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. తెలంగాణ సివిల్ సప్లై కమిషన్ ఆదేశాల మేరకు సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఎఫ్‌సీఐ అధికారులు మంథని మండలం సూరయ్యపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మి మోడ్రన్ పారాబాయిల్డ్ రైస్ అండ్ మిల్లులో ఏక కాలంలో తనిఖీలు నిర్వహించారు.
సివిల్ సప్లైకి సంబంధించిన 2022-23 సంవత్సరానికి సంబంధించిన ధాన్యం నిల్వలపై, ఎఫ్‌సీఐకి సంబంధించి 2023-24 సంవత్సరానికి సంబంధించి ధాన్యం, బియ్యం నిల్వలపై అధికారులు తనిఖీ చేశారు. మొదటగా సూరయ్యపల్లిలోని శ్రీ లక్ష్మి మోడ్రన్ పారాబాయిల్డ్ రైస్ అండ్ మిల్లులో తనిఖీ చేయడంలో మిల్లులో నిలువ ఉన్న ఎఫ్‌సీఐకి సంబంధించిన బియ్యం, ధాన్యం నిల్వలను తనిఖీ చేశారు. ఆనంతరం గంగాపురిలోని సత్యసాయి రైస్‌లో నిల్వ ఉంచిన స్టాక్‌ను పరిశీలించారు. ఈ తనిఖీల్లో 41,365.27 క్వింటాళ్ల ధాన్యానికి గాను 9689.8 కింటాళ్లు మాత్రమే లెక్కలోకి వచ్చాయి. మిగతా 31675.47క్వింటాళ్ల ధాన్యం స్వాహా అయినట్లు అధికారులు గుర్తించారు. అదే విధంగా ఎఫ్‌సీఐకి సంబంధించి 2023-24 రబీ సీజన్‌కు సంబంధించి 19,339 క్వింటాళ్లు మొత్తం ధాన్యం, బియ్యం నిలువ ఉన్నట్లు గుర్తించారు. కాగా తనిఖీలు నిర్వహిస్తున్న మిల్లు యజమాని సత్యనారాయణ అధికారులతో పలుసార్లు వాగ్వాదానికి దిగారు. ఈ దాడిలో సివిల్ సప్లై టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీ ప్రభాకర్, స్పెషల్ ఆఫీసర్ లక్ష్మారెడ్డి, సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ జంగయ్య, సివిల్ సప్లై పెద్దపల్లి డీటీ సంతోశ్ సింగ్, సివిల్ సప్లై ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌లు ఉన్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

